Assam tea : వేలంలో కిలో రూ.99,999 ధర పలికిన అస్సాం తేయాకు, ఆ టీ అమోఘమట

Assam Manohari Gold tea : గ‌తంలో న‌మోదు చేసిన రికార్డును అస్సాం మ‌నోహ‌రి గోల్డ్ తేయాకు బద్దలు కొట్టేసింది. డిబ్రూఘ‌ర్ జిల్లాకు చెందిన మ‌నోహ‌రి గోల్డ్ టీ వేలంలో ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. కిలో రూ.99,999 ధర పలికింది. గౌహ‌తి టీ వేలం సెంట‌ర్‌లో ఈ వేలం పాట నిర్వహించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 04:44 PM IST
  • రికార్డ్‌ బద్దలు కొట్టిన అస్సాం తేయాకు
  • డిబ్రూఘ‌ర్ జిల్లాకు చెందిన మ‌నోహ‌రి గోల్డ్ టీ కొత్త రికార్డ్
  • గౌహ‌తి టీ వేలం సెంట‌ర్‌లో కిలో రూ.99,999 ధర పలికిన తేయాకు
Assam tea : వేలంలో కిలో రూ.99,999 ధర పలికిన అస్సాం తేయాకు, ఆ టీ అమోఘమట

1kg of specialised Assam Manohari Gold variety tea sells for Rs 99,999: అస్సాం తేయాకు ( Assam tea) కొత్తగా రికార్డ్‌ బద్దలు కొట్టింది. డిబ్రూఘ‌ర్ జిల్లాకు చెందిన మ‌నోహ‌రి గోల్డ్ టీ వేలంలో ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. కిలో రూ.99,999 ధర పలికింది. గౌహ‌తి టీ వేలం సెంట‌ర్‌లో (Guwahati Tea Auction Centre) (GTAC) ఈ వేలం పాట నిర్వహించారు. 

గ‌తంలో న‌మోదు చేసిన రికార్డును మ‌నోహ‌రి గోల్డ్ (Manohari Gold) తేయాకు బద్దలు కొట్టేసింది. వేలంలో అత్య‌ధిక బిడ్డింగ్‌తో సౌర‌వ్ టీ ట్రేడ‌ర్స్.. మ‌నోహ‌రి గోల్డ్ తేయాకును (Manohari Gold tea) కొనుగోలు చేసింది. ఇక గతేడాది మ‌నోహ‌రి గోల్డ్ టీ కిలో 75 వేల‌ రూపాయలకు అమ్ముడుపోయింది. 

ఈ వేలం.. గౌహతి టీ వేలం కేంద్రం (GTAC)లో జరిగింది. అయితే ఈ ప్రత్యేకమైన టీకి చాలా డిమాండ్ ఉంది.. దీని ఉత్పత్తి కూడా తక్కువగా ఉందంటూ సౌరభ్ టీ ట్రేడర్స్ సీఈఓ ఎంఎల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఎన్నో రోజుల నుంచి తాము ఈ టీని సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే తేయాక తోట యజమాని దానిని తమకు ప్రైవేట్‌గా విక్రయించడానికి నిరాకరించాడని పేర్కొన్నారు. అయితే దాన్ని వేలం వేయడంతో ఎలాగైనా దక్కించుకోవాలని గట్టి పోటీ ఇచ్చామన్నారు. 

Also Read : జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్న చిరంజీవి.. నేడు మరో సినిమా అనౌన్స్‌మెంట్‌! క్రేజీ కాంబో

ఇక 2018లో ఇదే బ్రాండ్ కు సంబంధించి 1 కిలో తేయాకు ₹39,000కి వేలం పలికింది. ఆ సమయంలో కూడా సౌరభ్ టీ ట్రేడర్స్ (Saurabh Tea Traders) దానిని కొనుగోలు చేసింది. తర్వాత సంవత్సరం కూడా అదే కంపెనీ మళ్లీ ఆ తేయాకును కిలోగ్రాము ₹50,000 ప్రకారం వేలంలో కొనుగోలు చేసింది. ఇక 2020లో.. విష్ణు టీ కంపెనీ (Vishnu Tea Company) బిడ్‌ను గెలుచుకోవడంతో 1 కిలో తేయాకు ₹75,000కు దక్కించుకుంది. 

అయితే తాము 2018లో ఈ ప్రత్యేక వేరియంట్ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచీ మనోహరి గోల్డ్ టీకి చాలా ఎక్కువ డిమాండ్ ప్రారంభమైందని మనోహరి టీ ఎస్టేట్ యజమాని రాజన్ లోహియా (Rajan Lohia) చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది తాము మనోహరి గోల్డ్‌ తేయాకును 2 కిలోల కంటే కొంచెం ఎక్కువ ఉత్పత్తి చేశామని చెప్పుకొచ్చారు. ఇక దీని సాగు సాధారణ తేయాకు మాదిరిగా ఉండదని..దీని ఉత్పత్తి చాలా కష్టతరమని పేర్కొన్నారు. ఇక ఈ తేయాకుతో తయారు చేసే టీ (Tea) రుచి అమోఘమన్నారు.

Also Read : Google Warning: మీ స్మార్ట్‌ఫోన్లలో ఆ 8 యాప్‌లు ఉన్నాయా...వెంటనే తొలగించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News