iPhone Hacking Issue: దేశంలో ఆపిల్ దుమారం, విపక్షాల ఆరోపణలపై స్పందించిన కేంద్రం, విచారణకు ఆదేశం

iPhone Hacking Issue: ఆపిల్ సంస్థ మెయిల్ అలర్ట్ దేశంలో ఒక్కసారిగా రాజకీయ దుమారాన్ని రేపింది. మరోసారి ఫోన్య ట్యాపింగ్ అంశంపై కలకలం రేగుతోంది. విపక్ష నేతల నిరసనలు, ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2023, 06:10 PM IST
iPhone Hacking Issue: దేశంలో ఆపిల్ దుమారం, విపక్షాల ఆరోపణలపై స్పందించిన కేంద్రం, విచారణకు ఆదేశం

iPhone Hacking Issue: దేశంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఆపిల్ సంస్థ పంపిన అలర్ట్ మెయిల్స్‌తో భగ్గుమన్న విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ఫోన్ల హ్యాకింగ్ ప్రయత్నం జరుగుతోందంటూ ఆపిల్ సంస్థ స్వయంగా అలర్ట్ మెయిల్ పంపించడమే ఇందుకు కారణం. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

ఆపిల్ ఐడీలను కొంతమంది స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ హ్యాక్ చేసేందుకు రిమోట్ ప్రాంతాల్నించి ప్రయత్నిస్తున్నారంటూ ఆపిల్ సంస్థ స్వయంగా అలర్ట్ మెయిల్స్ పంపింది. దేశంలోని విపక్ష నేతలు చాలామందికి ఈ మెయిల్స్ అందాయి. వారిలో  ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, సదుద్దీన్ ఒవైసీ, శశిధరూర్, రాఘవ్ ఛడ్డా, మహువా మొయిత్రి, కేసీ వేణుగోపాల్, సీతారాం ఏచూరి, అఖిలేష్ యాదవ్, ప్రియాంక చతుర్వేది ఇలా చాలామంది ఉన్నారు. మీ ఫోన్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేది ఆ మెయిల్ అలర్ట్ సారాంశం. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, మీ ఫోన్‌లోని సెన్సిటివ్ ఇన్‌ఫో, కమ్యూనికేషన్స్, కెమేరా, మైక్రోఫోన్ యాక్సెస్ చేసే అవకాశముందని ఆపిల్ సంస్థ పంపించిన మెయిల్‌లో ఉంది. స్వయంగా ఆపిల్ సంస్థ నుంచి వార్నింగ్ రావడమే కాకుండా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ పదం వాడటంతో విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు. ఎందుకంటే స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే సాధారణంగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవారే అవుతారు. 

అయితే ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ మెయిల్ అలర్ట్ కేవలం ఇండియాలోని విపక్ష నేతలకే కాదని, ప్రపంచవ్యాప్తంగా 1509 దేశాల్లో ప్రజలకు వచ్చిందన్నారు. ఆపిల్ సంస్థ నుంచి తమకు వార్నింగ్ అలర్ట్ వచ్చిందని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోందని, కేసు సాంకేతిక స్వభావం దృష్టిలో ఉంచుకుని లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇతర ఏజెన్సీలకు విచారణకు ఆదేశించామన్నారు. ఆపిల్ సంస్థ పంపింది అలర్ట్ మెస్సేజ్ మాత్రమేనని, ఎవరూ హ్యాకింగ్ చేయలేరని చెప్పిందన్నారు. ప్రతిపక్ష నేతలు కావాలనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి మూలాలు కనుగొంటామన్నారు. 

Also read: iPhone Tapping: దేశంలో ఫోన్ ట్యాపింగ్ దుమారం, ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ విపక్ష ఎంపీలకు ఆపిల్ అలర్ట్ వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News