Hyderabad Crime: ఇన్‌స్టాలో ప్రేమ.. తూతూ మంత్రంగా పెళ్లి.. కట్ చేస్తే శవమైన బాలిక

Miyapur Girl Murder Case: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి.. అతని ఇంటికి వెళ్లి ఓ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. మియాపూర్‌కు చెందిన ఐశ్వర్య హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 18, 2024, 08:53 PM IST
Hyderabad Crime: ఇన్‌స్టాలో ప్రేమ.. తూతూ మంత్రంగా పెళ్లి.. కట్ చేస్తే శవమైన బాలిక

Miyapur Girl Murder Case: హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన ఐశ్వర్య (17) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మియాపూర్ సీఐ క్రాంతి కుమార్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. "ఈ నెల 10వ తేదీన ఫిర్యాదు వచ్చింది. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాం. చింటూ అనే అబ్బాయి మీద అనుమానం ఉందని ఫిర్యాదులో చెప్పారు. అతనితో పాటు స్నేహితులు సాకేత్, కళ్యాణి అనే వారిని అదుపులోకీ తీసుకుని విచారించాం. ఉప్పుగూడ ప్రాంతంలో బ్యాండ్‌లో ప్లేయర్‌గా పని చేస్తున్న చింటుకు ఇంస్టాగ్రామ్‌లో ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. పది రోజుల కిందట చింటూ ఉంటున్న ఇంటికి ఐశ్వర్య వెళ్ళింది. 

Also Read: Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్‌ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ

అయితే రెగ్యులర్‌గా ఐశ్వర్య తన పేరెంట్స్‌తో మాట్లాడుతోంది. ఐశ్వర్య తల్లిదండ్రులకు ఫోన్ చేసిన చిటూ.. ఐశ్వర్య మీ ఇంటికి వచ్చిందంటూ బుకాయించాడు. రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మియాపూర్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు. పెళ్లి చేసుకోమని ఐశ్వర్య ఒత్తిడి తీసుకురావడంతో తూతూ మంత్రంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అదే రోజు చింటూ, అతని స్నేహితులు హత్యకు ప్లాన్ చేశారు. దిండుతో తలకు ఊపిరాడకుండా హత్య చేశారు.

ఉప్పుగూడ నుంచి మీర్‌పేట్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేసిన బాడీను చెత్తతో కప్పేశారు. చింటూ, స్నేహితులను అదుపులోకీ తీసుకుని విచారించాం. అసలు నిందితుడు చింటూ, అతని స్నేహితులను అరెస్ట్ చేశాం. గతంలో చింటూపై దొంగతనం కేసు ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు మృతదేహాన్ని తరలించాం. నిందితులను రిమాండ్ తరలించాం.." అని సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.

సోమవారం తుక్కుగూడ శివార్లలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ సమీపంలో మైనర్ బాలిక మృతదేహం లభ్యం కావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మియాపూర్‌లోని టెక్ అంజైహ్ నగర్‌కు చెందిన ఐశ్వర్య  నవంబర్ 8 నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also Read: Snakes: కాటు వేయలేదు.. భయపెట్టలేదు.. రెండు నిండు ప్రాణాలు తీసిన సర్పం.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News