Viral Video: కారులో ప్రియురాలితో రోమాన్స్ చేస్తున్న సర్పంచ్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన భార్య.. వీడియో వైరల్..

Romance Video viral: సర్పంచ్ కారులో తన ప్రియురాలితో కలిసి  ఎంజాయ్ చేస్తున్నాడు. భలే టైమ్ దొరికిందని ఇద్దరు మనసు విప్పి మరీ మాట్లాడు కుంటున్నట్లు ఉన్నారు. అక్కడ కొంత మంది వీరిని గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 18, 2024, 09:06 PM IST
  • మరో యువతితో సర్పంచ్ పాడుపని..
  • చుక్కలు చూపించిన భార్య..
Viral Video: కారులో ప్రియురాలితో రోమాన్స్ చేస్తున్న సర్పంచ్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన భార్య.. వీడియో వైరల్..

Husband extramarital affair with lover video: కొంత మంది ఇటీవల కాలంలో పెళ్లికున్న పవిత్ర బంధాన్ని పూర్తిగా మంట కల్పుతున్నారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని కట్టుకున్న వాళ్ల కొంపలు ముంచుతున్నారు. కొంత మంది పెళ్లి చేసుకున్న భార్యలకు వంట రాదని, అందంగా లేదని వేధిస్తున్నారు. మరికొంత మంది కట్నం తేలేదని, కూరలు వండటం రావడంలేదని శాడిజం చూయిస్తున్నారు. మరికొందరు భార్యలకు తెలియకుండా సీక్రెట్ గా అఫైర్ లు పెట్టుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

పని మీద వెళ్తున్నామని, వేరే చోట సెకండ్ సెటప్ లను మెంటైన్ చేస్తున్నారు. ఇక కొంతమంది మహిళలు తామేంతక్కువ తిన్నామా.. మాకేం తక్కువ అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. భర్తకు తెలియకుండా.. బాయ్ ఫ్రెండ్ లతో ఎంజాయ్ చేస్తున్నారు.

 

భర్త ఇంట్లో ఉన్నంత సేపు సత్యపూసల్లాగా ఉంటూ.. భర్త గడప దాటగానే.. బరితెగించేస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల పచ్చని కాపురాల్లో వారి చేజేతులా నిప్పులు పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎఫైర్ లకు చెందిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..  

మధ్య ప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సావాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జితేందర్ మాలి కొన్నేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. అతనికి నలుగురు సంతానం. అయితే.. జితేందర్ మాలీ ప్రవర్తన కొన్ని రోజులుగా ఏదో అనుమానస్పదంగా ఉండటం భార్య గమనించింది. ఈక్రమంలో భర్త.. ఇటీవల ఉజ్జయిని వెళ్లాడు. అప్పటికే అతని భార్య నిఘా పెట్టింది. అక్కడ హోటల్ లో తన భర్త, ప్రియురాలితో దిగినట్లు ఆమెకు సమాచారం అందింది.

వెంటనే అక్కడకు భార్య, పిల్లలు చేరుకున్నారు. హోటర్ బైట.. కారులో భర్తతో ప్రియురాలు ఎంజాయ్ చేస్తుండగా.. ఒక్కసారిగా సర్పంచ్ భార్య ఎంట్రీ ఇచ్చింది. దీంతో అతనికి నోటి నుంచి మాటలు రాలేదు.  ఈ క్రమంలో భార్య పిల్లలు మాత్రం.. సర్పంచ్ లవర్ కు చుక్కలు చూపించారు. ఆమెను ఇష్టమున్నట్లు కొడుతూ, నోటికోచ్చిన బూతులు తిడుతూ చుక్కలు చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read more:  Viral Video: ఇయ్యే వద్దనేది.. కింగ్ కోబ్రాకు ముద్దులు పెట్టుకుంటూ డాన్సర్ హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..

 

అయితే.. అతనికి ఇప్పటికే ఒక మహిళతో గొడవలు జరిగి డైవర్స్ అయిపోయాయి. ప్రస్తుతం రెండో  పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో యువతితో యవ్వారంనడుపుతున్నట్లు విషయం బైటికొచ్చినట్లు తెలుస్తొంది. సదరు మహిళ.. సర్పంచ్ రెండో భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సర్పంచ్ తన భార్య.. చాలా వేధిస్తుందనికూడా చెప్పాడంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News