Arpita Mukherjee's Driver Interview: పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీల గురించి ఇప్పటికే మీడియాలో అనేక కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అర్పితా ముఖర్జీకి, పార్థ చటర్జీకి ఏంటి సంబంధం ? పార్థకు ఆమె బినామినా ? పార్థ చేసిన నేరాలు, అవినీతిలో ఆమెకు కూడా వాటా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని కొంతకాలం పాటు దగ్గరిగా చూసిన అర్పిత పర్సనల్ డ్రైవర్ ప్రణభ్ భట్టాచార్యను జీ మీడియా ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ చేసి అతడి నుండి మరిన్ని రహస్యాలు రాబట్టింది. జూలై 22న అర్పితా ముఖర్జీకి చెందిన డైమండ్ సిటీ సౌత్ ఫ్లాట్‌లో ఈడీ సోదాలు చేసినప్పుడు ఆమె డ్రైవర్ ప్రణబ్ కూడా అక్కడే ఉన్న సంగతి తెలిసిందే.
అర్పితా ముఖర్జీ డ్రైవర్ ప్రణభ్ భట్టాచార్య ఇంటర్వ్యూ నుంచి కొన్ని ముఖ్యాంశాలు..
అర్పితా ముఖర్జీ వద్ద అలా డ్రైవర్‌గా చేరాను
ఈ ఏడాది జనవరి నుంచే.. అంటే ఆమె వద్ద డ్రైవర్‌గా చేరి కేవలం 7 నెలలు మాత్రమే కావస్తోంది. గతంలో పార్థ చటర్జీని కలిసి ఏదైనా ఉద్యోగం ఇప్పించాల్సిందిగా కోరాను. నా నెంబర్ ఇవ్వమన్నారు. కొద్ది రోజుల తర్వాత పార్థ చటర్జీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. అర్పితా ముఖర్జీ వద్ద డ్రైవర్‌గా పనిలో చేరాలని చెప్పారు. అర్పితా ముఖర్జీకి చెందిన డైమండ్ సిటీ సౌత్ ఫ్లాట్‌కి వెళ్లి చూడగా అక్కడ హోండా సిటీ, మెర్సిడెస్ బెంజ్, మినీ కూపర్ కార్లు ఉన్నాయి. నా చేతికి హోండా సిటీ కారు మాత్రమే ఇచ్చి డ్రైవ్ చేయమన్నారు. గత కొన్ని నెలలుగా మెర్సిడెస్ బెంజ్, మినీ కూపర్ కార్లు కనిపించ లేదు. అవి ఏమయ్యాయో కూడా తెలీదు. అర్పితా ముఖర్జీ ఆఫీసుకు వెళ్లేటప్పుడు లేదా బ్యూటీ పార్లర్‌కి వెళ్లేటప్పుడు తాను కారు డ్రైవ్ చేసే వాడిని.
అర్పితా ముఖర్జీ, పార్థ చటర్జీ అలా కలుసుకునే వాళ్లు..
డైమండ్ సిటీ సౌత్ ఫ్లాట్‌లో ఉంటున్న అర్పితా ముఖర్జీని కలిసేందుకు అప్పుడప్పుడు పార్థ చటర్జీ వచ్చి వెళ్తుండే వాడు. ఇంకొన్నిసార్లు పని ముగించుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో అర్పితా ముఖర్జీనే పార్థ చటర్జీ వద్దకు వెళ్తుండేది. అలా వెళ్లేటప్పుడు తనని పార్థ చటర్జీ ఫ్లాట్ వద్ద డ్రాప్ చేసి మళ్లీ తన కారును తిరిగి తన అపార్ట్‌మెంట్ వద్దే పార్క్ చేసి వెళ్లిపొమ్మని చెప్పేది. అలాగే చేసే వాడిని.
కళ్యాణ్ ధర్ తరచుగా వచ్చి వెళ్తుండే వాడు...
ఇటీవలే అర్పితా ముఖర్జీ తన కుటుంబాన్ని శాంతినికేతన్‌కి షిఫ్ట్ చేశారు. తన తల్లి, సోదరి, సోదరి భర్తతో కలిసి ఆమె అక్కడికి వెళ్లారు. మేము అక్కడే రెండు రోజులు ఉన్నాం. ఆమెకు సంబంధించిన పనులన్నీ ఆమె సోదరి భర్త కళ్యాణ్ ధర్ పర్యవేక్షిస్తుంటారు. అతడు తరచుగా ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండే వాడు.
అక్కడేం జరుగుతుందో తెలిసేది కాదు..
అర్పితా ముఖర్జీ లావాదేవీల గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. కారులో ఎప్పుడూ, ఏమీ తీసుకెళ్లినట్టుగానూ నేను చూడలేదు. నేను డ్యూటీకి వెళ్లినప్పుడు ఫ్లాట్‌కి వెళ్లి కారు తాళం చెవి తీసుకుని వచ్చి కారులో కూర్చునే వాడిని. ఆమె ఇంట్లో ఎక్కువ సమయం కేటాయించే వాడిని కాదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలిసేది కాదు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నా ఫోన్ లాగేసుకున్న అధికారులు.. నన్ను బాల్కనీలో వేచి ఉండమని చెప్పారు. అర్పితా ముఖర్జీ ఎవరెవరిని కలిసేదని, ఆమెను ఎవరెవరు కలిసే వారు, ఎక్కడికి వెళ్లే విషయాలన్నీ అడిగారు. ఆ తర్వాతే నన్ను వదిలేశారు అని ప్రణబ్ భట్టాచార్య చెప్పుకొచ్చాడు.
Also Read : Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ ఇంట్లో 'ఆ' టాయ్స్.. పార్థబాబు కోరిక తీర్చలేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Arpita Mukherjee Secret Life: అర్పితా ముఖర్జీ, పార్థ చటర్జీల గురించి డ్రైవర్ చెప్పిన రహస్యాలు
అర్పితా ముఖర్జీ డ్రైవర్ ప్రణభ్ భట్టాచార్య ఇంటర్వ్యూ నుంచి కొన్ని ముఖ్యాంశాలు..
అర్పితా ముఖర్జీ, పార్థ చటర్జీ అలా కలుసుకునే వాళ్లు..
కళ్యాణ్ ధర్ తరచుగా వచ్చి వెళ్తుండే వాడు..