Bihar hooch Tragedy: బీహార్‌లో కల్తీ మద్యం కలకలం..11మంది మృతి!

Spuriou liquor: బీహార్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ రక్కసి ధాటికి మూడో రోజుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 04:31 PM IST
  • బీహార్‌ రాష్ట్రంలో విషాదం
  • కల్తీ మద్యం తాగి..11 మంది మృతి
  • నలంద జిల్లాలో ఘటన
Bihar hooch Tragedy: బీహార్‌లో కల్తీ మద్యం కలకలం..11మంది మృతి!

Bihar hooch Tragedy: బీహార్‌లో కల్తీ మద్యం (spurious liquor) కలకలం రేపింది. నలంద జిల్లాలో (Nalanda district)కల్తీ మద్యం తాగి 11 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న నేపథ్యంలో... కొంతమంది కల్తీమద్యానికి అలవాటుపడి ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం రాత్రి నలంద పట్టణంలోని చోటి పహరి, పహరితల్లి ప్రాంతాల్లో మద్యం తాగిన నలుగురు శనివారం ఉదయం  తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు అదే రోజు సాయంత్రం... ఆదివారం ఉదయం ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు నలంద జిల్లా ఎస్పీ అశోక్‌ మిశ్రా తెలిపారు.

 కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందిన ఎస్‌హెచ్‌వోను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఉదయం మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించినట్టు చెప్పారు. 2016 ఏప్రిల్‌లో మద్యం వినియోగం, విక్రయాలపై పూర్తి నిషేధం విధించింది బీహార్ ప్రభుత్వం (Bihar Govt). అయితే గత రెండు నెలల కాలంలోనే ఉత్తర బీహార్ లోని నాలుగు జిల్లాల్లో ఈ కల్తీ మద్యం తాగి దాదాపు 40 మందికిపైగా మృతి చెందారు.  ఈ నేపథ్యంలో నీతీశ్‌ ప్రభుత్వంలో (CM Nitish Kumar) భాగస్వామిగా ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ జేడీయూ నేతలపై విమర్శలు గుప్పించారు. 

Also Read: Jallikattu 2022: తమిళనాడులో జోరుగా ‘జల్లికట్టు’ పోటీలు...ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x