Biren Singh Sworn in as Manipur CM: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్.బీరేన్ సింగ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా సోమవారం (మార్చి 21) బీరెన్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీరెన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేపట్టబోయే చర్యల్లో మొదటిది రాష్ట్రాన్ని అవినీతిరహితంగా మార్చడమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తానని అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టబోయే చర్యల్లో రెండవది.. రాష్ట్రంలో డ్రగ్స్‌ను నిర్మూలించడమని చెప్పారు. ఇక మూడవది.. రాష్ట్రంలోని తిరుగుబాటు గ్రూపులతో చర్చలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే ఐదేళ్ల కాలానికి ఇవే మొదటి మూడు ప్రాధాన్యతలని చెప్పుకొచ్చారు.
బీరేన్ సింగ్ ప్రమాణస్వీకారం అనంతరం ఎమ్మెల్యేలు నెంచ కిప్జెన్, ఖేంచంద్ సింగ్, విశ్వజిత్ సింగ్, అవంగ్బౌ న్యూమై, గోవింద కొంతౌజంలు కేబినెట్ మంత్రలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసినందుకు.. జేపీ నడ్డాకు సాదర స్వాగతం పలుకుతూ బీరేన్ సింగ్ ట్విట్టర్ ద్వారా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 60 స్థానాలకు గాను బీజేపీ 32 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను సొంతంగానే సాధించినట్లయింది. గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన బీజేపీ ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఆ అవసరం లేకుండా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్‌కి మరోసారి అవకాశం దక్కుతుందా దక్కదా అన్న దానిపై కొంత మీమాంస నెలకొన్నప్పటికీ.. ఆదివారం నాటి శాసనాసభాపక్ష సమావేశంలో బీరేన్ సింగ్నే బీజేపీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా బీరేన్ పగ్గాలు చేపట్టారు.
Also Read: Manchu Manoj: ఆ ఒక్కడు మా అన్నను టార్గెట్ చేశాడు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్..
Also Read: China Flight Crash: చైనా విమాన ప్రమాదంలో ఎవరూ బతకలేదా..కొండపై చెలరేగుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook