Budget 2022: కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం: నిర్మలా సీతారామన్

Budget 2022: దేశంలోని ఐదు ప్రధాన నదులను అనుసంధానం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 03:55 PM IST
  • కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి
  • నదుల అనుసంధానంపై ప్రకటన
  • కృష్ణా, గోదావరి, పెన్నా నదులు ఇంటర్ లింకింగ్
Budget 2022: కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం: నిర్మలా సీతారామన్

Budget 2022- Five Major River Interlinking Project: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా..దేశంలోని ఐదు ప్రధాన నదులను అనుసంధానం (Five Major River Interlinking Project) చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఇంటర్‌ లింకింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా ఖరారైందని మంత్రి తెలిపారు. దీని ద్వారా దమన్‌గంగ-పింజల్‌, పార్‌-తాపి-నర్మద, గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే వీటిని కేంద్రం అమలు చేస్తుందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి (Nirmala Sitharaman) కెన్-బత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. రూ.46,000 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీని ద్వారా 9.05 లక్షల హెక్టార్లకు సాగునీరు, 65 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉత్తర భారతదేశ నదులను, దక్షిణ భారతదేశ నదులతో అనుసంధానం చేయడం ద్వారా సౌత్ రైతులు ఎదుర్కొంటున్న నీటి సంబంధిత ఇబ్బందులను తీర్చవచ్చని భావిస్తున్నారు.  

గోదావరిలో నీటి లభ్యత వెల్లడించి అనుసంధానం ప్రారంభించాలని తెలంగాణ ఇదివరకే కేంద్రాన్ని కోరింది. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కూడా తమ ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా నదుల అనుసంధానాన్ని చేపట్టాలని ఇదివరకే మోదీ సర్కారుకు సూచించింది.

Also Read: Budget 2022: బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలను నిరాశ పరిచింది: సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News