All in One Digital ID: ఒక్కొక్క పనికి ఒక్కో ఐడీ కార్డు..ఇబ్బందే..త్వరలో ఆల్ ఇన్ వన్ డిజిటల్ ఐడీ కార్డు

All in One Digital ID: దేశంలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క కార్డు. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా లిస్ట్ పెద్దదే. అయితే ఈ అన్ని ఐడీలు కలిపి ఒకే కార్డులో ఉంటే బాగుంటుంది కదా. కేంద్రం ఇప్పుడు ఇదే ఆలోచిస్తోంది. త్వరలో కార్యరూపం దాల్చవచ్చు కూడా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2022, 12:12 PM IST
All in One Digital ID: ఒక్కొక్క పనికి ఒక్కో ఐడీ కార్డు..ఇబ్బందే..త్వరలో ఆల్ ఇన్ వన్ డిజిటల్ ఐడీ కార్డు

All in One Digital ID: దేశంలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క కార్డు. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా లిస్ట్ పెద్దదే. అయితే ఈ అన్ని ఐడీలు కలిపి ఒకే కార్డులో ఉంటే బాగుంటుంది కదా. కేంద్రం ఇప్పుడు ఇదే ఆలోచిస్తోంది. త్వరలో కార్యరూపం దాల్చవచ్చు కూడా ( All in One Digital ID Card to replace aadhaar , pancard , Driving license and passport )

దేశంలో వివిధ రకాల ఐడీ కార్డులున్నాయి. అడ్రస్ లేదా గుర్తింపు కోసం ఆధార్ కార్డు. ఇతర ఏ కార్డు కావాలన్నా అధార్ కార్డే ఆధారం. ఇన్‌కంటాక్స్ వివరాలకు పాన్‌కార్డు, విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు, వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా జాబితా పెద్దదే. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కార్డు ఉంది. ఫలితంగా ఐడీ కార్డుల అప్‌డేట్ అనేది క్లిష్టంగా మారుతోంది. పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, స్పెల్గింగ్ వివరాల్లో తప్పులు దొర్లడం, సరిచేసుకునేందుకు తిరగడం అంతా సమస్యే. ఈ అన్ని కార్డుల్ని అనుసంధానం చేస్తూ ఒకటే డిజిటల్ ఐడీ ఉంటే ఎలా ఉంటుందనేది కొత్తగా వచ్చిన ఆలోచన. అదే ఇప్పుడు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఆన్ ఇన్ వన్ డిజిటల్ కార్డుకు సిద్ధమౌతోంది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ ఐడీ కార్డులన్నింటినీ కలిపి ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటీటీస్‌గా రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆధార్ కార్డు మాదిరిగా ఓ గుర్తింపు సంఖ్య ఉండవచ్చు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా ఈ ప్రతిపాదన రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తం ఒకేచోట ఉండేందుకు ఇది దోహదపడుతుంది. కేవైసీ లేదా ఈ కేవైసీకు కూడా ఈ డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. ఒక్కొక్క వ్యక్తికి 4-5 ఐడీ కార్డులు ఉండేకంటే..ఒకే డిజిటల్ ఐడీ కార్డు ఉంటే మంచిదనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇంకా ప్రాథమిక దశలో ఉన్న ఈ ఆలోచనపై పూర్తి స్థాయిలో లోతైన అధ్యయనం, రక్షణ చర్యలు పరిశీలించిన తరువాతే అమల్లో రావచ్చు. అటు ఈ అంశంపై ప్రజాభిప్రాయం కూడా సేకరించే అవకాశాలున్నాయి.

Also read: LPG cylinder price Rs 633: కేవలం 633 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. పూర్తి వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News