ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి..!

ఢిల్లీలో కురుస్తోన్న మంచు.. విమానాలు, రైలు సేవలకి అంతరాయం

Last Updated : Dec 15, 2017, 12:45 PM IST
ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి..!

దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పేసింది. ఢిల్లీలో భారీగా మంచు కురుస్తుండటంతో రైళ్ల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతానికి 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, రెండు రైళ్లని రీషెడ్యూల్ చేసి మరో 12 రైలు సర్వీసులని రద్దు చేసినట్టు సంబంధిత రైల్వే అధికారులు తెలిపారు. 

నేడు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టం 8 డిగ్రీల సెల్సియస్ వుండనుండగా గరిష్టంగా 18 డిగ్రీల సెల్సియస్ వుండనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. చల్లటి గాలులబారి నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో నిరాశ్రయులైన చాలామంది గురువారం రాత్రి నైట్ షెల్టర్స్ లో తలదాచుకుని చలి మంట కాచుకున్నారు.

ఇటీవల ఉత్తర భారతంలో కురిసిన వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. భారీ పొగ మంచు కారణంగా ఢిల్లీలో రైలు సర్వీసులకే కాకుండా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ విమానాల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.  

 

 

Trending News