Flash: సీఎంని కలిసిన కొన్ని గంటలకే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనావైరస్!

గుజరాత్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖెరావాలాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అహ్మెదాబాద్‌లోని జమాల్ పూర్-ఖేరియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుజరాత్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇమ్రాన్‌‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

Last Updated : Apr 15, 2020, 12:09 AM IST
Flash: సీఎంని కలిసిన కొన్ని గంటలకే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనావైరస్!

అహ్మదాబాద్: గుజరాత్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖెరావాలాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అహ్మెదాబాద్‌లోని జమాల్ పూర్-ఖేరియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుజరాత్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇమ్రాన్‌‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే, ఇమ్రాన్‌కు కరోనా ఉందని తేలడానికి కొన్ని గంటల ముందే ఆయన పలు సమస్యలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా సహా పలు ఇతర నేతలు, పాత్రికేయులని కలిసి మాట్లాడారు. సరిగ్గా ఇక్కడే అందరినీ ఓ భయం వెంటాడుతోంది. 

కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఇమ్రాన్ తనకు తెలియకుండానే ఇంత మంది ప్రముఖులను కలిసి వచ్చారు కదా!! ఆయన నుంచి వీళ్లలో ఎవరికైనా ఆ కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందా అనేదే ఇప్పుడు చాలా మందిని వేధిస్తోన్న ప్రశ్న. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News