India Corona Update: కరోనా మహమ్మారి ప్రభావం ఇండియాలో క్రమంగా తగ్గుతోంది. పొరుగుదేశం చైనాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే..ఇండియాలో భారీగా తగ్గుముఖం పడుతోంది.
కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం ఇండియాలో దాదాపుగా తగ్గింది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. జనవరి-ఫిబ్రవరి వరకూ రోజుకు లక్షల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలకు దిగువన వచ్చేశాయి. దేశంలో కరోనా కొత్త కేసులు రోజుకు 3 వేలకంటే తక్కువే నమోదవుతున్నాయి. అటు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా దేశవ్యాప్తంగా తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 7 వేలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..2 వేల 539 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు ఇప్పుడు 0.35 శాతంగా ఉంది.
మరోవైపు దేశంలో కరోనా కారణంగా గత 24 గంటల్లో కేవలం 60 మంది మరణించారు. ఇప్పటి వరకూ అంటే కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి..5 లక్షల 16 వేలమంది మరణించారు. గత 24 గంటల్లో దేశంలో 4 వేల 491 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.73 శాతంగా ఉండగా..కరోనా యాక్టివ్ కేసుల శాతం పడిపోతోంది. దేశంలో కరోనా యాక్టివ్ రేటు ఇప్పుడు 0.07 శాతం మాత్రమే ఉంది. ఇక ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా 12-14 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. నిన్న తొలిరోజే దేశవ్యాప్తంగా 2.60 లక్షలమంది పిల్లలకు వ్యాక్సిన్ అందించారు.
మరోవైపు జూన్ 22 నాటికి దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభం కానుందని ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ విభాగం హెచ్చరించింది. ఈ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కరోనా థర్ద్‌వేవ్ విషయంలో కాన్పూర్ ఐఐటీ విభాగం చేసిన హెచ్చరిక దాదాపుగా అదే తేదీల్లో నిజమైంది.
Also read: Supreme Court on Hijab Issue: హిజాబ్‌పై విచారణ ప్రారంభించనున్న సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook