COVID-19: 5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

COVID-19 cases in India: న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో గతంలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది. 

Last Updated : Jun 27, 2020, 03:24 PM IST
COVID-19: 5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

COVID-19 cases in India: న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరోనావైరస్‌ పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో గతంలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది. గత 24 గంటల్లో 18,552 కొత్త కేసులు నమోదు కాగా.. 384 మంది రోగులు మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 5,08,953 కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 15,685 మంది కరోనావైరస్‌తో మృతి చెందారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 10,244 మంది రోగులు కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 1,97,387 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.  ఇప్పటివరకు 2,95,881 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు.  రికవరీ రేటు గతం కంటే మెరుగుపడి 58.13శాతానికి పెరిగింది.

Trending News