Earthquake in Karnataka: కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా(Chikkaballapura District)లో వరుసగా రెండోరోజు భూమి కంపించింది. గురువారం(డిసెంబరు 23) మధ్యాహ్నం 2.16 గంటలకు 18 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) వెల్లడించింది.
జిల్లాలోని సదెనహళ్లి, బీరగనహళ్లి, సెట్టిగేర్ గ్రామాలకు 1.2 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం(epicenter) ఏర్పడినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ కేంద్రం(KSNDMC) అధికారులు వెల్లడించారు. సుమారు 20-30 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించినట్లు చెప్పారు. ఇలాంటి భూకంపాలతో ఎలాంటి ప్రమాదం లేదని, స్వల్ప ప్రకంపనలు సంభవించిన క్రమంలో ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని సూచించారు. ఈ ప్రాంతం సీస్మిక్ జోన్ IIలో ఉంది.
Earthquake of Magnitude:3.6, Occurred on 23-12-2021, 14:16:18 IST, Lat: 13.54 & Long: 77.74, Depth: 18 Km ,Location: Chikkaballapura, Karnataka, India for more information download the BhooKamp App pic.twitter.com/SRw8ZiowBV
— National Center for Seismology (@NCS_Earthquake) December 23, 2021
Also Read: Earthquake in Tamilnadu: తమిళనాడు వెల్లూరులో భూకంపం-రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు
అదే విధంగా బుధవారం ఉదయం చిక్కబళ్లాపుర జిల్లాలోని ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్‌పై 2.9, 3.0 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. కేఎస్‌ఎన్‌డీఎంసీ ప్రకారం, ఉదయం 7.10, 7.15 గంటల సమయంలో భూప్రకంపనలు(Earthquake) సంభవించాయి.
వెల్లూరులో భూకంపం
తమిళనాడులోని వెల్లూరులో కూడా ఇవాళ భూకంపం(Earthquake in Vellore) సంభవించింది. గురువారం (డిసెంబర్ 23) మధ్యాహ్నం 3.14గం. సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. వెల్లూరుకు వాయువ్యం దిశగా 50కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook