Earthquake in Tamilnadu: తమిళనాడులోని వెల్లూరులో భూకంపం సంభవించింది. గురువారం (డిసెంబర్ 23) మధ్యాహ్నం 3.14గం. సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. వెల్లూరుకు వాయువ్యం దిశగా 50కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ఈ వివరాలు వెల్లడించింది. గత నెలలోనూ వెల్లూరులో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది.
An earthquake of magnitude 3.5 occurred 50 km west-northwest of Vellore, Tamil Nadu at 1514 hours today: National Center for Seismology (NCS)
— ANI (@ANI) December 23, 2021
ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం కర్ణాటకలోని బెంగళూరులో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. నగరంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. బెంగళూరుతో పాటు చిక్‌బళ్లాపుర జిల్లాలోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. బెంగళూరుకు (Bengaluru Earthquake) 66కి.మీ దూరంలో భూమిలో 23కి.మీ లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు గుర్తించారు. గత నెలలో అసోంతో పాటు రాజస్తాన్‌లోనూ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలోనూ అసోంలో భూకంపం సంభవించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలా తరచూ భూకంపాలు సంభవించండం ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: World's Largest Fish: వైజాగ్ బీచ్‌కు ప్రపంచంలోనే అతి పెద్ద చేప
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook