Gmat Exam: జీ మ్యాట్ పరీక్షా విధానంలో వచ్చిన మార్పులేంటో తెలుసా..

Gmat Exam: ప్రపంచవ్యాప్తంగా  జరిగే ఎంబీఏ ప్రవేశాలకు కీలకమైంది జీ మ్యాట్. గ్రాడ్యుయేట్ మేనేజ్‌‌మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఇప్పుడు జీ మ్యాట్ పరీక్షా విధానంలో స్వల్ప మార్పులు చేపట్టారు. ఆ మార్పులేంటంటే..  

Last Updated : Feb 13, 2021, 12:52 PM IST
  • జీమ్యాట్ ఆన్ లైన్ పరీక్షా విధానంలో స్వల్ప మార్పులు చేపట్టిన జీ మ్యాక్ సంస్థ
  • గతంలో ఆన్ లైన్ విధానంలో తొలగించిన అనలిటికల్ రౌటింగ్ అస్సెస్ మెంట్ విభాగం తిరిగి చేర్చిన జీ మ్యాక్
  • ప్రపంచవ్యాప్తంగా 45వేలకు పైగా జీ మ్యాట్ పరీక్షలు నిర్వహించిన జీ మ్యాక్
Gmat Exam: జీ మ్యాట్ పరీక్షా విధానంలో వచ్చిన మార్పులేంటో తెలుసా..

Gmat Exam: ప్రపంచవ్యాప్తంగా  జరిగే ఎంబీఏ ప్రవేశాలకు కీలకమైంది జీ మ్యాట్. గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఇప్పుడు జీ మ్యాట్ పరీక్షా విధానంలో స్వల్ప మార్పులు చేపట్టారు. ఆ మార్పులేంటంటే..

గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ సంక్షిప్తంగా జీ మ్యాట్ ( Gmat ) జీ మ్యాక్ అనే లాభాపేక్ష లేని సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 223 బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. జీ మ్యాక్ .. జీ మ్యాట్ పరీక్ష( Gmat exam) నిర్వహిస్తుంటోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం జీ మ్యాట్ ఆన్‌లైన్ విధానం( Gmat online pattern )లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చేపట్టారు. గతంలో జీ మ్యాట్ పరీక్షలో తొలగించిన అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్ ( Analytical writing assessment ) విభాగాన్ని తిరిగి చేర్చారు. పరీక్ష రాసే అభ్యర్ధులకు అదనపు సౌలభ్యం కల్పించడంతో పాటు వాస్తవ పరీక్షా కేంద్రం అనుభూతి తెచ్చేందుకు చేపట్టిన చర్యల్లో ఇదొకటని జీ మ్యాట్ పరీక్షను నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ అంటే జీ మ్యాక్( Gmac )వెల్లడించింది. శరవేగంగా మారుతున్న మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా ఏడబ్ల్యూఏ వంటి జీ మ్యాట్‌లోని కొన్ని అంశాల్ని ఆన్‌లైన్ పరీక్షల ప్రారంభంలో తొలగించారు. ఇప్పుడు తిరిగి చేర్చారు. 

ఇప్పటి వరకూ 150 దేశాల్లో 45 వేలకు పైగా జీ మ్యాట్ పరీక్షలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 2 వేల 3 వందల బిజినెస్ స్కూళ్ల ( Business schools )లో ప్రవేశాలకు జీ మ్యాట్ ప్రామాణికంగా ఉంటుంది. ప్రపంచంలోని ఎంబీఏ ప్రవేశాలు ప్రతి పదింటిలో 9 సంస్థలకు జీ మ్యాట్ స్కోరే ( Gmat score )ప్రాతిపదిక, ఆధారం. అందుకే జీ మ్యాట్ పరీక్షంటే అంత డిమాండ్. విద్యార్ధులకు అంత ఆసక్తి.

Also read: JEE Main 2021 Admit Card: జేఈఈ మెయిన్ 2021 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News