Gujarat Exit Poll Results: గుజరాత్‌లో మళ్లీ బీజేపీకే పట్టం, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు

Gujarat Exit Poll Results: గుజరాత్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. మెజార్టీ సర్వేలు గుజరాత్‌లో మరోసారి బీజేపీకు పట్టం కడుతున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఏమంటోందో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2022, 07:52 PM IST
Gujarat Exit Poll Results: గుజరాత్‌లో మళ్లీ బీజేపీకే పట్టం, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు

గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. రెండు దశల్లోనూ పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవడం ఎవరికి అనుకూలిస్తుంది ఎవరికి కాదనేది పక్కనబెడితే..ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్లీ బీజేపీ అంటున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో గుజరాత్‌లో ఈసారి బీజేపీ గతం కంటే మెరుగైన సీట్లు రాబట్టుకుంది. ఈసారి బీజేపీకు 125-143 సీట్లు వస్తాయని..కాంగ్రెస్ పార్టీ 30-48 సీట్లకు పరిమితం కానుందని వెల్లడైంది. అటు భారీగా ప్రభావం చూపిస్తుందనుకున్న ఆప్ 3-7 సీట్లు గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్‌లో తెలిసింది. అదే సమయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం ఏకంగా 21 శాతం ఉండటం విశేషం.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకు 46 శాతం, కాంగ్రెస్ పార్టీకు 25 శాతం ఉంటే..ఆమ్ ఆద్మీ పార్టీకు 16 శాతం, ఇతరులకు 13 శాతం ఓట్లు వస్తాయని తెలుస్తోంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 3గా ఉంది. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 వరకూ సభల్లో ప్రధాని మోదీ పాల్గొనడమే కాకుండా అమిత్ షా స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి ఎన్నికల వ్యూహాలు రచించడం ఈ పరిస్థితి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఓట్ల శాతం కారణంగా జాతీయ పార్టీ హోదా దక్కించుకోవచ్చు. అదే సమయంలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకు సీట్ల సంఖ్య పెరిగినా..ఓటు శాతం 3.1 వరకూ తగ్గింది. అటు కాంగ్రెస్ పార్టీకు సీట్ల సంఖ్యతో పాటు ఓటింగ్ శాతం కూడా 16.4 శాతం తగ్గిపోయింది. 

కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ వంటి జాతీయ నేతలెవరూ గుజరాత్ ఎన్నికలపై దృష్టి సారించకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాగూర్ వంటి ఉద్యమ నేతలు చేరడం బీజేపీకు ప్లస్‌గా మారింది. రైతులు, సామాన్యుల్లో బీజేపీపై అసంతృప్తి ఉన్నా..మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీజేపీకు పట్టం కట్టారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది.

పీపుల్స్ పల్స్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 60 అసెంబ్లీ స్థానాల్లో 240 పోలింగ్ స్టేషన్లలో 4800 శాంపిల్స్ ఆధారంగా ఈ ఫలితాలు వెల్లడించింది. 

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు

బీజేపీ                                      125-140 స్థానాలు

కాంగ్రెస్ పార్టీ                              30-48 స్థానాలు

ఆప్                                               3-7 స్థానాలు

Also read: Gujarat Election 2022: నేడే గుజరాత్‌లో రెండో దశ పోలింగ్.. ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు వేసేది ఇక్కడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News