ముంబైలో కలకలం: బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ అదృశ్యం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ కిరణ్‌ సంఘ్వీ(38) కనబడుటలేదు.

Updated: Sep 8, 2018, 11:21 PM IST
ముంబైలో కలకలం: బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ అదృశ్యం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ కిరణ్‌ సంఘ్వీ(38) కనబడుటలేదు. బుధవారం నుండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ కిరణ్‌ సంఘ్వీ అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8.30గంటలకు ఇంటి నుండి ఆఫీసుకి  బయల్దేరి ఆ తర్వాత సంఘ్వీ ఇంటికి తిరిగి రాలేదు.

గురువారం ఉదయం నవీ ముంబయి ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో ఆయన కారు లభ్యమైంది. కారు సీటుకు రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సిద్ధార్థ్‌ భార్య ఆయన అదృశ్యంపై పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని సంఘ్వీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఆఫీసు నుంచి ఆయన ఎప్పటిలాగానే పనులు ముగించేసుకుని రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇంటికి బయల్దేరారని కార్యాలయ సిబ్బంది పేర్కొనగా.. ఆయన ఫోన్‌ కమల మిల్స్‌  వద్ద స్విఛ్‌ ఆఫ్‌ అయ్యిందని.. ఆయన ఆఫీసు నుంచి బయటకు వచ్చి కాలి నడకన వెళ్లడం సీసీ కెమెరాల్లో నమోదు అయ్యిందని.. ఆ సమయంలో ఆయన కారు ఎక్కడా లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అడిషనల్‌ పోలీసు కమిషనర్‌ రవీంద్ర మాట్లాడుతూ.. సంఘ్వీ ఆచూకీ త్వరలోనే లభిస్తుందని తెలిపారు.