Metro Rail services: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ఎలా ఉండనున్నాయి ?

కరోనా మహమ్మారి నేపధ్యంలో నిలిపివేసిన మెట్రో సర్వీసులు  సెప్టెంబర్ 7 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే మెట్రో సేవల పునరుద్ధరణ విషయంలో జారీ కానున్న నిర్ధిష్ట గైడ్ లైన్స్  ను కేంద్రం ప్రకటించనుంది.

Last Updated : Sep 1, 2020, 10:08 PM IST
Metro Rail services: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ఎలా ఉండనున్నాయి ?

కరోనా మహమ్మారి ( Corona pandemic ) నేపధ్యంలో నిలిపివేసిన మెట్రో సర్వీసులు ( Metro rail services )  సెప్టెంబర్ 7 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే మెట్రో సేవల పునరుద్ధరణ విషయంలో జారీ కానున్న నిర్ధిష్ట గైడ్ లైన్స్  ను కేంద్రం ప్రకటించనుంది. 

కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపధ్యంలో మార్చ్ 22 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ ( Lockdown ) ప్రక్రియ ముగిసి...అన్ లాక్ 4 ( Unlock 4 ) కూడా ప్రారంభమైంది. ఈ నేపధ్యంతో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసుల్ని తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ( Standard operating procedure ) ( SOP ) మాత్రం ఇంకా ఖరారు కావల్సి ఉంది. ఈ గైడ్ లైన్స్ ను సెప్టెంబర్ 2వ తేదీన కేంద్రం ఖరారు చేయనుంది. దీనికోసం ఇప్పటికే మంగళవారం నాడు మెట్రో కార్పొరేషన్లతో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 15 మెట్రో రైల్ కార్పొరేషన్ల ఎండీలు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న సలహాలు, సూచన ఆధారంగా విధివిధానాలను ఖరారు చేస్తారు. 

సెప్టెంబర్ 3వ తేదీ అంటే బుధవారం నాడు మార్గదర్శకాలు ( Guidelines ) విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి మెట్రో రైళ్లను ఎక్కడ ప్రారంభించాలనే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రయాణీకులు మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించడంపై కఠినంగా  వ్యవహరించనున్నారు. అంటే జరిమానాలు భారీగానే ఉండవచ్చు. మెట్రోలో టోకెన్ వినియోగాన్ని తొలగించి..స్మార్ట్ కార్డులని మాత్రమే ఉపయోగించేలా నిర్ణయం ఉండనుంది. తప్పని సరి ధర్మల్ స్క్రీనింగ్, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ తో పాటు ప్రతి స్టేషన్ లో మెట్రో రైలు నిలిపే సమయం పెంచడం, ఫ్రెష్ ఎయిర్ కోసం రైళ్లలో ఎయిర్ కండీషన్స్ లో మార్పులు , స్టేషన్లలో క్యూ విధానం వంటివి కొత్తగా రావచ్చు. Also read: Election Commission: నూతన ఎన్నికల కమీషనర్ గా రాజీవ్ కుమార్

Trending News