Summer Effect: ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న ఎండలు, వచ్చే వారం రోజులు మరీ డేంజర్

Summer Effect: వేసవి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న మూడ్రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2024, 11:54 AM IST
Summer Effect: ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న ఎండలు, వచ్చే వారం రోజులు మరీ డేంజర్

Summer Effect: గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఎండలు మండుతూ ఉక్కపోత పెరుగుతోంది. ఏప్రిల్ - మే రాకుండానే ఎండల తీవ్రత పెరగడం ఆందోళన కల్గిస్తోంది. రానున్న మూడు నాలుగు రోజులు ఎండలు మరింత పెరగవచ్చని తెలుస్తోంది. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలు ఉంటోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలు కూడా నమోదవుతోంది. రాయలసీమ ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇక విజయవాడ, ఏలూరు, ఒంగోలు, రాజమండ్రి ప్రాంతాల్లో 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. గాలిలో తేమ క్రమంగా తగ్గుతూ వేడి గాలులు మొదలవుతున్నాయి. ఉదయం 8-9 గంటల్నించే ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో రోజువారీ కూలీలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 

అటు తెలంగాణలో కూడా ఎండలు మండుతున్నాయి. రాత్రి వేళ తేమ లేకపోవడంతో హ్యుమిడిటీ పెరిగిపోతోంది. అదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.3 డిగ్రీలు నమోదైంది. అటు ఆసిఫాబాద్‌లో కూడా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలు దాటితే ఎండల తీవ్రత పెరిగిపోతోంది. రానున్న వారం రోజులు తెలంగాణ, ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. అందుకే బయట ఎండల్లో తిరిగేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. 

Also read: NPS New Rules: నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కొత్త రూల్స్, ఏప్రిల్ 1 నుంచి అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News