Public Holidays: మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా నలు మూలల్నించి పెద్ద సంఖ్యలో భక్తజనం పవిత్ర స్నానాలకై ప్రయాగ్ రాజ్ చేరుతున్నారు. కోట్లాదిమంది భక్తుల రాకపోకలతో ప్రయాగ్ రాజ్ కిక్కిరిసిపోయింది. అందుకే మూడు రోజులు పాటు పబ్లిక్ హాలిడేస్ ఇవ్వనున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో మూడ్రోజులపాటు పబ్లిక్ హాలిడేస్ ప్రకటించాలనే డిమాండ్ విన్పిస్తోంది. మహా కుంభమేళాతో పాటు వసంత పంచమి కూడా ఉన్నందున సెలవులు ఇచ్చే ఆలోచనలో యూపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే వారణాసి జిల్లాల్లో స్కూల్స్ అన్నీ ఫిబ్రవరి 5 వరకూ క్లోజ్ చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం వసంత పంచమి సెలవు తేదీ మార్చాలని కోరుతున్నాయి. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు లేఖ రాశాయి. వసంత పంచమి పుణ్యస్నానం తేదీ ఫిబ్రవరి 3 అయితే ఫిబ్రవరి 2గా ప్రకటించినట్టు ఉపాధ్యాయులు ప్రస్తావించారు. అందుకే సెలవు కూడా ఫిబ్రవరి 3వ తేదీనే ఇవ్వాలని కోరారు. అదే సమయంలో జనవరి 29 అంటే ఇవాళ మౌని అమావాస్య సెలవు ప్రకటించాలని కోరాయి.
144 ఏళ్ల తరువాత వచ్చిన మహా కుంభమేళాలో కుటుంబ సభ్యులతో సహా పవిత్ర స్నానాలు చేసేందుకు వీలుగా మూడు రోజులు పబ్లిక్ హాలిడేస్ ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి రోజుల్లో పవిత్ర స్నానాలకై సెలవులు ప్రకటించాలంటున్నారు.
మహా కుంభమేళా రద్దీని దృష్టిలో ఉంచుకుని 1వ తరగతి నుంచి 12 వరకూ అందరికీ ఆన్‌లైన్ తరగతులు నిర్వరిస్తున్నారు. వారణాసిలో అయితే 12వ తరగతి వరకూ ఆన్‌లైన్ తరగతులే జరగనున్నాయి. మొత్తానికి మహా కుంభమేళా పురస్కరించుకుని మూడ్రోజులు సెలవులు రానున్నాయి.
Also read: Kumbha mela: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృత్యువాత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి