హైదరాబాద్: నగరంలో పెట్రో ధరలు భగభగ మంటున్నాయి. గతంలో ఎన్నడు లేనంతగా పెరిగిపోయాయ్. లీటర్ పెట్రోల్ ధర రూ.75 పలుకుతుండగా.. ఇక లీడర్ డీజిల్ ధర 67కి చేరింది. లీటర్ పెట్రోల్ రేటు రూ. 73 నుంచి అతి తక్కువ కాలంలోనే రూ. 75కు చేరుకుంది.. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.. డీజిల్ విషయానికి వస్తే దేశ చరిత్రలోనే గరిష్టంగా రూ. 67.22కు చేరింది. పెట్రో ధరలు అమాంతగా పెరగడానికి గల కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమేనని పెట్రో కంపెనీలు పేర్కొంటున్నాయి. కాగా చమురుపై రాష్ట్రాలకు ప్రత్యేకంగా పన్ను విధించే అవకాశం ఉండడంతో.. దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రేట్లు ఉంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో పెట్రో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..రండి.
పెట్రో ధరలు:
ప్రదేశం | లీటర్ పెట్రోల్ ధర | డీజిల్ లీటర్ ధర |
హైదారాబాద్ | రూ. 75 | 67.22 |
ఢిల్లీ | రూ.71.27 | రూ. 61.88 |
చెన్నై | రూ. 73.89 | రూ. 65.23 |
ముంబై | రూ. 79.15 | రూ. 65.9 |
కోల్‌కత్తా | రూ. 74 | రూ. 64.9 |
కేంద్ర విధానంపై జనాల ఆగ్రహం
ధరల నియంత్రణ పెట్రో సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాక పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. రోజువారీ ధరల నియంత్రకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక రోజు కాస్త తగ్గినట్లే తగ్గి రెండో రోజు అమాంతంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ విధానంపై సామాన్య జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.