/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

'కరోనా వైరస్'.. భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు క్రమక్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం విశేషం. 

నిన్న ఒక్క రోజులోనే 2 వేల 293 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. గత 24  గంటల్లో కరోనా మహమ్మారికి 71  మంది బలయ్యారు. ఒక్కరోజులోనే ఇంత మంది చనిపోవడం భారత్‌లో కొత్త రికార్డుగా చెప్పవచ్చు.  మొత్తంగా ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్ట్య 37 వేల మార్క్ దాటింది. ఇప్పటి వరకు 37 వేల 336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 26  వేల 167  కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 12 వందల 18 మంది కరోనా మహమ్మారికి బలి అయ్యారు. మొత్తంగా 9 వేల 950 మంది కరోనా వైరస్ పాజిటివ్ రోగులు చికిత్స తీసుకుని నయం కావడంతో సురక్షితంగా ఇళ్లకు వెళ్లారు. 

మరోవైపు మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా  కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్క్ దాటింది. మొత్తంగా రాష్ట్రంలో 11 వేల 506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు 485 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు చికిత్స తీసుకుని 18 వందల  79 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారు. 

మహారాష్ట్ర తర్వాత రెండోస్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్ లో  4 వేల 721 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 236 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.  అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ గుబులు రేకెత్తిస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 14 వందల  63 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 403 మంది నయం చేసుకుని ఇంటికి వెళ్లారు. 33 మంది చనిపోయారు. ఇటు తెలంగాణలో మొత్తం 1039  కేసులు నమోదయ్యాయి. 441 చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లగా 26 మంది చనిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Section: 
English Title: 
India records 2,293 coronavirus cases in highest single-day spike
News Source: 
Home Title: 

భారత్‌లో 24 గంటల్లో 71 మంది మృతి

భారత్‌లో 24 గంటల్లో 71 మంది మృతి
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
భారత్‌లో 24 గంటల్లో 71 మంది మృతి
Publish Later: 
No
Publish At: 
Saturday, May 2, 2020 - 12:00