Railway Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్ట్ నుంచి తాజా నోటిఫికేషన్ జారీ అయింది. ఆర్ఆర్‌బిలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 1036 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆసక్తి కలిగిన, ఆర్హత ఉన్న అభ్యర్ధులు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి కొత్తగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1036 ఖాళీలున్నాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతో పాటు టెట్‌లో ఉత్తీర్ణత పొందినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్ వైజర్లు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఛీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్ఠర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ పోస్టుల భర్తీ జరగనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు పిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్ఆర్‌బి నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 187, సైంటిఫిక్ సూపర్ వైజర్ పోస్టులు 3, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 338, ఛీఫ్ లా అసిస్టెంట్ పోస్టులు 54, పబ్లిక్ ప్రోసిక్యూటర్ పోస్టులు 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్ఠర్ పోస్టులు 18, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 2, జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులు 130, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 3, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్ఠర్ పోస్టులు 59, మ్యూజిక్ టీచర్ పోస్టులు 10, ప్రైమరీ రైల్వే టీచర్ పోస్టులు 3, లైబ్రేరియన్ పోస్టులు 188, అసిస్టెంట్ టీచర్ పోస్టులు 2, లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు 7, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు 12 ఉన్నాయి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇవాళ్టి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 6 వరకు కొనసాగనుంది. జనరల్ కేటగరీ అభ్యర్ధులకు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఈబీసీ, మైనార్టీ అభ్యర్ధులు 250 రూపాయలు చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్‌లేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Also read: ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకు టీమ్ ఇండియా జట్టులో ఎవరికి అవకాశం, ఎవరికి నో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.