ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని కుప్వారా జిల్లా మచ్చిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు.

Last Updated : Jun 6, 2018, 11:42 AM IST
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని కుప్వారా జిల్లా మచ్చిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు చొరబాటుకు యత్నించిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను హతమార్చారు. మచ్చికల్‌ సెక్టార్‌లో భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటువంటి ఘటనే ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని కేరాన్ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు హతమార్చినట్లు నివేదికలు తెలిపాయి. గత నెలలో తంగ్దర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ దాటి చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ఇదిలా ఉండగా మంగళవారం జమ్ము కాశ్మీర్‌లో బందిపొరాలోని హాజిన్‌ ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. క్యాంపు ఇరువైపుల నుంచి ఒకేసారి సుమారు ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 8 రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అయితే భారత జవాన్లు ఈ కాల్పులకు దీటుగా సమాధానమిచ్చారని ఆర్మీ అధికారి చెప్పారు. ప్రాణ నష్టం జరుగలేదని ఆ అధికారి అన్నారు.

 

Trending News