Karnataka: కర్ణాటకలో కొత్త మంత్రిమండలి ఏర్పడింది. శాఖల కేటాయింపుపై అసంతృప్తి రేగుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలు ఆకస్మికంగా భేటీ అయ్యారు. అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు ప్రారంభించారు.
కర్ణాటకలో (Karnataka)రాజకీయం ఇంకా వేడిగానే ఉంది. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపు ఇబ్బందిగా మారింది. కొత్త మంత్రిమండలి ఏర్పాటు అనంతరం శాఖల కేటాయింపుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వెళ్లగక్కారు. కొందరైతే బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచారు. మంత్రులు ఆనంద్ సింగ్, ఎంటీబీ నాగరాజు, వి సోమన్న, శశికళ జొలై తదితరులు తమకు కేటాయించిన శాఖలపై అలక వహించారు. పదవులు దక్కని ఎమ్మెల్యేలు పూర్తిగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రంగంలో దిగారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో ఆకస్మికంగా సమావేశమయ్యారు.
శాఖల కేటాయింపుపై అసంతృప్తికి గురైన మంత్రులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతానంటున్నారు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Basavaraja Bommai). విధాన సౌధ ముందు పునప్రతిష్ఠించిన నెహ్రూ విగ్రహాన్ని ముఖ్యమంత్రి బొమ్మై ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి నిజ లింగప్ప వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. మంత్రి ఆనంద్ సింగ్‌తో కలిసి మాట్లాడారు. ఎంటీబీ నాగరాజుతో మాట్లాడతానన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప(Yediyurappa) తనకు కేటాయించిన శాఖను రద్దు చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా వర్తించే సౌకర్యాలు చాలని, మంత్రి పదవి వద్దని కోరారు.
Also read: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇకపై వాట్సప్ ద్వారా..ఎలా తీసుకోవాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
కర్ణాటకలో మంత్రివర్గ శాఖల కేటాయింపులో అలకలు, బుజ్జగించే ప్రయత్నాల్లో సీఎం బొమ్మై