Kolkata murder case: కోల్ కతా డాక్టర్ ఘటన భయానకం.. తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాష్ట్రపతి..

Trainee doctor rape and murder case: ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తొలిసారి స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మహిళల  భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 28, 2024, 05:09 PM IST
  • కోల్ కతా ఘటనపై వెల్లువెత్తిన నిరసనలు..
  • తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముర్ము
Kolkata murder case: కోల్ కతా డాక్టర్ ఘటన భయానకం.. తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాష్ట్రపతి..

President murmur hot comments on Kolkata doctor incident: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుప్రీమ్ కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతుంది. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ లో ప్రస్తుతం బీజేపీ పిలుపునిచ్చిన.. పన్నేండు గంటల పాటు బంద్ నడుస్తోంది. అది కూడా పూర్తిగా హింసాత్మకంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా.. కొంత మంది దుండగులు బీజేపీ నేతలపై బాంబులతో విరుచుకుపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను వెస్ట్ బెంగాల్ కు చెందిన బీజేపీ నేత.. సువేందు అధికారి తన ఎక్స్ ఖాతాలో సైతం పొస్టు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ ఘటనపై ఇప్పటికే పలువులు నిందితులకు సీబీఐ కోల్ కతా కోర్టు ఆదేశాలమేరకు పాలీగ్రాఫ్ టెస్టులు సైతం చేసింది. అంతేకాకుండా.. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..ప్రస్తుతం కోల్ కతా ఘటనపై తాజాగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

పూర్తివివరాలు..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి కోల్ కతా ఘటనపై మాట్లాడారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. అంతేకాకుండా..  ఏ నాగరిక సమాజం కూడా మహిళలపై దాడులు జరగటాన్ని అంగీకరించబోదన్నారు. కానీ సమాజంలో మాత్రం ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఘటనలు మాత్రం ఆందోళనకరంగా మారాయన్నారు.  పదేళ్ల క్రితం నిర్భయ ఘటన జరిగిన తర్వాత కూడా సమాజంలో అనేక ఘటనలు జరిగాయన్నారు.

ఇప్పటికైన సమాజం మేల్కొవాల్సిన అవసరముందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. అంతేకాకుండా.. మహిళలు అన్నిరంగాలలో రాణిస్తున్నఈ తరుణంలో.. ఇలాంటి ఘోరాలు జరగటం దారుణమన్నారు. నాలుగైదు ఏళ్ల చిన్నారులపై కూడా దారుణాలు జరగటం ఘోరమన్నారు. ఈ ఘటనల పట్ల ఇప్పటికైన మేల్కొనాల్సిన అవసరముందని ముర్ము అన్నారు.

Read more: Bengal Bandh: రణరంగంగా మారిన కోల్ కతా.. బీజేపీ కీలక నేతపై దుండగుల కాల్పులు.. వీడియో వైరల్..

ఇదిలా ఉండగా.. ఆగస్టు 9 నజరిగిన ట్రైనీ డాక్టర్  ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఆర్ జీకర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ సెమినార్ గదిలొ విగత జీవిలా ఉన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి యావత్ దేశం కూడా ఈ ఘటనపై తమ నిరసలు తెలియజేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News