Bengal Bandh: రణరంగంగా మారిన కోల్ కతా.. బీజేపీ కీలక నేతపై దుండగుల కాల్పులు.. వీడియో వైరల్..

Kolkata Doctor Rape and Murder Case: కోల్ కతా లో నిరసనలు తెలియజేస్తున్న విద్యార్థులపై  పోలీసులు కాల్పుల ఘటనలను  ఖండిస్తు బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో  దుండగులు బీజేపీ నేతలు కాల్పులకు తెగబడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 28, 2024, 01:13 PM IST
  • హింసాత్మకంగా మారిన కోల్ కతా బంద్..
  • దీదీపై ఫైర్ అయిన బీజేపీ నేతలు..
Bengal Bandh: రణరంగంగా  మారిన కోల్ కతా.. బీజేపీ కీలక నేతపై దుండగుల కాల్పులు.. వీడియో వైరల్..

Kolkata bandh goons attacks on bjp leader priyangu pandey: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై దేశంలో తీవ్ర నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో.. నబన్న అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కాస్త రణరంగంగా మారింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ,విద్యార్థుల్ని అణచివేసే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా..  భాష్పవాయువు గోళాలు, వాటర్ కాన్స్ లతో దాడులు చేశారు. ఈ క్రమంలో బీజేపీ మమతా ప్రోద్బలంతోనే పోలీసులు దాడులకు పాల్పడినట్లు విమర్శించారు. పోలీసుల దాడుల్ని కాల్పులను ఖండిస్తు.. బీజేపీ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఈ పోలీసులు ఎక్కడికక్కడ భారీ బలగాలను మోహరించాయి. కోల్ కతాలో బంద్ సాగుతుంది. అనేక చోట్ల బంద్ హింసాత్మకంగా మారింది. గుర్తుతెలియని దుండగులు పోలీసులపైకి రాళ్లదాడికి పాల్పడ్డారు.

 

ఇదిలా ఉండగా.. ఉత్తర పరగణాజిల్లాలో బీజేపీ కీలక నేత ప్రియాంగు పాండేపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వెస్ట్ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి.. ఈ ఘటనను ఇన్ స్టాలో ఈ ఘటనను పోస్టు చేశారు. మమతా పై మండిపడ్డారు. మమతకు చెందిన టీఎంసీ గుండాలే ఈ కాల్పులకు పాల్పడినట్లు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా..ఈ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు.  

బీజేపీ నేతలే టార్గెట్ గా మమతా గుండాలు దాడులకు పాల్పడుతున్నారని కూడా.. బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. దీదీ సర్కారుకు వ్యతిరేకంగా కొంత మంది విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఎక్కడికక్కడ బస్సులు, రైళ్లను ఆపివేసి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Read more: Kolkata doctor case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ..

మరోవైపు.. బస్సులలో డ్రైవర్ లు, సాధారణ ప్రయాణికులు.. తమ తలకు హెల్మెట్ లను ధరించి మరీ ప్రయాణిస్తున్నారు. కొంత మంది నిరసన కారులు బస్సులపై కూడా దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో..ట్రైనీ డాక్టర్ ఘటనను తప్పుదొవ పట్టించేందుకు టీఎంసీ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని కూడా  బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News