Fire accident in serum factory: ప్రతిష్ఠాత్మక కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపు చేస్తున్నాయి.
మహారాష్ట్ర పూణే ( Pune )లో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute of india ) లో భారీ అగ్ని ప్రమాదం ( Fire Accident in serum factory ) సీరమ్ ఇనిస్టిట్యూట్‌లోని గేట్ నెంబర్1 నుంచి దట్టమైన నల్లటి పొగలు వెలువడుతుండటంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి. వెంటనే సంఘటనా ప్రాంతానికి అగ్నిమాపక బలగాలు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ దళాలు చేరుకుని..మంటల్ని అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) సంస్థ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( Covishield ) ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రమాదానికి కారణమేంటనే విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ఏ మేరకు ఆస్థినష్టం సంభవించిందనేది తెలియలేదు.
Also read: Covid vaccine: రెండవ దశ వ్యాక్సినేషన్‌లో ప్రధాని మోదీ వ్యాక్సిన్ తీసుకోనున్నారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook