Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం

Tamilnadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఫుల్ లెంగ్త్ కేబినెట్ ఉండవచ్చని తెలుస్తోంది. కేబినెట్ మంత్రులెవరంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2021, 07:16 PM IST
Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం

Tamilnadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఫుల్ లెంగ్త్ కేబినెట్ ఉండవచ్చని తెలుస్తోంది. కేబినెట్ మంత్రులెవరంటే..

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో(Tamilnadu Assembly Elections) డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. రేపు డీఎంకే ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే (DMK) అధినేత , మాజీ దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్‌లో ఉదయం 9 గంటలకు ఏ ఆర్భాటం లేకుండా అతి తక్కువమందితో ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరోవైపు మంత్రివర్గం కూడా రేపే స్టాలిన్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేయనుందని తెలుస్తోంది. అది కూడా 34 మందితో కూడిన ఫుల్ లెంగ్త్ కేబినెట్ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. స్టాలిన్ కేబినెట్‌ ( Stalin Cabinet) లో ఎవరెవరికి స్థానం దక్కుతోంది..కేటాయించిన శాఖలేంటనే వివరాలు ఇలా ఉన్నాయి.

1. ఎంకే స్టాలిన్, ముఖ్యమంత్రి ( Mk Stalin as Tamilnadu CM) గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం జల వనరుల శాఖ మంత్రిగా దురై మురుగన్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేఎన్ నెహ్రూ, సహకార శాఖ మంత్రిగా ఐ పెరియసామి, ఉన్నత విద్య మంత్రిగా ఎన్ పొన్ముడి వ్యవహరించవచ్చు. ఇక పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఈవీ వేలు, వ్యవసాయమంత్రిగా ఎంఆర్కే పన్నీరు సెల్వం, రెవిన్యూ మంత్రిగా రామచంద్రన్, పరిశ్రమల మంత్రిగా తంగం థెన్నరసు, న్యాయశాఖ మంత్రిగా రఘుపతి ఉండవచ్చు. 

మిగిలిన శాఖలు...మంత్రుల వివరాలు

ఎస్‌. ముత్తుసామి: గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి
కేఆర్‌ పెరియకరుప్పన్‌: గ్రామీణాభివృద్ధి శాఖ
టీఎం అంబారసన్‌: గ్రామీణ పరిశ్రమలు
ఎంపీ సామినాథన్‌: సమాచార, ప్రచార శాఖ
పి. గీతాజీవన్‌: సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత
అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌: మృత్స్యకార, జంతు పరిరక్షణ
ఎస్‌ఆర్‌ రాజకన్నప్పన్‌: రవాణా శాఖ
కే రామచంద్రన్‌: అటవీ శాఖ
ఆర్‌ చక్రపాణి: ఆహార, పౌర సరఫరా
వీ. సెంథిల్‌ బాలాజీ: విద్యుత్‌, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌
ఆర్‌ గాంధీ: చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ
ఎంఏ సుబ్రమణియన్‌: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
పి. మూర్తి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌
ఎస్‌ఎస్‌ శివశంకర్‌: బీసీ సంక్షేమం
పీకే శేఖర్‌బాబు: దేవాదాయ శాఖ
పళనివేల్‌ త్యాగరాజన్‌: ఆర్థిక, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌
ఎస్‌ఎమ్‌ నాజర్‌: పాలు, డెయిరీ డెవలప్‌మెంట్‌
జిగ్నీ కేఎస్‌ మ​స్తాన్‌: మైనారిటీ, ఎన్నారై సంక్షేమం
అన్బిల్‌ మహేశ్‌ పొయ్యమొళి: పాఠశాల విద్య
శివ వీ మెయ్యనాథన్‌: పర్యావరణ శాఖ
సీవీ గణేశన్‌: కార్మిక సంక్షేమం, నైపుణ్య శిక్షణ
టి మనో తంగరాజా: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
ఎం మతివెంతన్‌: పర్యాటక శాఖ
ఎన్‌కే సెల్వరాజ్‌: ఆది ద్రవిడ సంక్షేమం

Also read: Covid Third Wave: కరోనా థర్డ్ వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారంటూ సుప్రీంకోర్టు ప్రశ్న

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News