Odisha Train Accident: నేను బతికే ఉన్నా.. మృతదేహాలలో పోలీస్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి.. షాకింగ్ ఘటన..!

Odisha Train Accident Death Count: ఒడిశా రైలు ప్రమాదంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన ఊపిరితో ఉన్న వ్యక్తులను కూడా మృతదేహాలలో కలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. మృతదేహాల మధ్యలో నుంచి ఓ వ్యక్తి పోలీస్ కాళు పట్టుకుని తాను బతికే ఉన్నానని చెప్పాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 7, 2023, 12:44 PM IST
Odisha Train Accident: నేను బతికే ఉన్నా.. మృతదేహాలలో పోలీస్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి.. షాకింగ్ ఘటన..!

Odisha Train Accident Death Count: ఒడిశా రైలు ప్రమాదంలో కన్నీరు తెప్పించే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటివరకు 288 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 40 మంద విద్యుత్‌ షాక్‌తోనే మరణించారు. మరో బాధాకర విషయం ఏంటంటే.. కొన ఊపిరితో ఉన్న వాళ్లను కూడా మృతదేహాలలో కలిపి వేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో నిర్లక్ష్యం కారణంగా మరికొందరు మృతి చెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన ఊపిరితో ఉన్నవాళ్లు కాలో.. చేయి కదిపిన సమయంలో గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతదేహాల మధ్య తన కొడుకు చేయిని ఓ తండ్రి గుర్తుపట్టి చూడగా.. అతను ఇంకా బతికే ఉండగా ఆసుపత్రికి తరలించారు. 

తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఓ పాఠశాలలో మృతదేహాలను భద్రపరగా.. ఓ పోలీస్ సిబ్బంది అటువైపు వెళ్తుండగా ఓ వ్యక్తి కాలును పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆ పోలీస్.. కాస్త ధైర్యం తెచ్చుకుని కిందకు చూశాడు. తాను చనిపోలేదని.. బతికే ఉన్నానని పోలీస్ కాళు పట్టుకున్న వ్యక్తి చెప్పాడు. అతడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన రాబిన్‌ నైయా (35)గా గుర్తించారు. రైళు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి.. సృహ తప్పిపడిపోయాడు. అతను చనిపోయాడని భావించిన రెస్క్యూ టీమ్.. మృతదేహాలలో కలిపేసి పాఠశాలకు తీసుకువెళ్లారు. 

పోలీస్ అటుగా వెళ్లడంతో కాళు పట్టుకుని.. తనకు దాహంగా ఉందని నీళ్లు ఇవ్వాలని అడిగాడు రాబిన్ నైయా. సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయారో లేదో నిర్ధారించకుండా.. బతికి ఉన్న వాళ్లను మృతదేహాలలో కలిపేయడం విమర్శలకు తావిస్తోంది.

Also Read: IND vs AUS WTC Final 2023: నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్.. తుది జట్లు ఇవే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కోరమండల్ రైలు ప్రమాదంపై స్పష్టమైన కారణాలు ఏంటనే విషయంపై క్లారిటీ రావడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో వైఫల్యం కారణంగో ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారించగా.. దర్యాప్తు బృంద సభ్యుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణ తరువాత పూర్తయిన తరువాత అసలు కారణం తెలియనుంది. సీబీఐ కూడా రంగంలోకి విచారణ చేస్తోంది.

Also Read:  Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News