Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
Maharashtra Exit Poll 2024 Live Mahayuti Or Mahagathbandhan: రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న మహారాష్ట్ర గడ్డపై మళ్లీ జెండా ఎగరవేసేది ఎవరు? స్పష్టంగా ఒక పార్టీకి ఇచ్చారా? లేదంటే మళ్లీ సంకీర్ణ కూటమికి మద్దతు పలికారా అనేది తెలుసుకోండి.
Public Holiday On 15th And 20th November: ప్రభుత్వ విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు సెలవుల మూడ్ నుంచి ఇక బయటపడలేదు. అప్పుడే మరో రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఎప్పుడు.. ఎందుకు.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన అందరికీ తెలిసిందే. రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేశారు. అయితే రైతుల నిరసన కేవలం ఇక్కడే కాదు విదేశాల్లో కూడా కన్పిస్తుంటుంది. యూరప్‌లోని చాలా దేశాల్లో తమ డిమాండ్ల సాధనకై రోడ్డెక్కారు. ప్రదర్శన చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం విషయంలో రైతన్నలు ఆందోళన చేస్తున్నారు.
Cotton Candy Ban: రంగురంగుల్లో కనిపించే తియ్యటి పీచు మిఠాయి మీ పిల్లలు తింటుంటే ఇక ఆపేయండి. వెంటనే తినొద్దని చెప్పేయండి. ఆ పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే రెండు చోట్ల నిషేధం విధించగా.. ఏపీ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.
Sonia Gandhi Election Affidavit: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించారు. రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తుండడంతో ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో కీలక విషయాలు పంచుకున్నారు. ఆమె ఆస్తుల లెక్కలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Zomato Customer Finds Cockroach in Noodles Soup: వినియోగదారులను దేవుళ్లుగా భావించాలని ఉన్నా హోటల్ నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆహార పదార్థాలు వండే సమయంలో శుభ్రత, నాణ్యత పాటించడం లేదని తెలుస్తోంది. దీనివలన తరచూ పార్సిల్స్లలో చనిపోయిన జీవులు దర్శనమిస్తున్నాయి. అవి చూసిన వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
Never Spoke In Parliament: తమ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతో ప్రజలు తమ ఓట్ల ద్వార ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం అధికారంలో కొనసాగుతూ ప్రజలను పట్టించుకోరు. వారు ఎంతలా అంటే చట్టసభలో తమ వాణి కూడా వినిపించనంతగా. తాజాగా ముగుస్తున్న లోక్‌సభలో కొందరు నోరు కూడా విప్పలేని పరిస్థితి ఉంది. ఇక వారు గెలిచి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
PM Selfie Points at Ration Shops: ప్రధాని మోదీ సెల్ఫీ పాయింట్లపై తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా తాజాగా ఓ ముఖ్యమంత్రి అవి అవసరం లేదని చెప్పారు. దీనివలన చాలా ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అలా ఫొటోలు వాడడం సరికాదని చెప్పారు.
Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
Anganwadi Jobs: పదవిని అడ్డం పెట్టుకుని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్రమాలకు తెరలేపాడు. అమాయకులైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరు చెప్పి వారిని వంచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు రంగంలోకి దిగడంతో వారు కటకటాల పాలయ్యారు.
నాగాలాండ్‌కు చెందిన పర్యాటక, ఉన్నత శాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్. భారీ కాయంతో చైనీయులు, జపానల్ మాదిరి ఉంటారు. మనిషి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు కీలక విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన ఓ వీడియా అందరినీ ఆకట్టుకుంటుంది. టిమ్జెన్ చేసిన పనికి నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ప్రజలకు అవగాహ కల్పించేందుకు ఆయన చేసిన పని ఆదర్శంగా నిలిచింది.
Ancient Idols Found In River: తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో శ్రీ మహావిష్ణువు, శివలింగం బయల్పడింది. విష్ణువు విగ్రహం అచ్చం అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ రూపంలో ఉండడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఆ విగ్రహ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Sonia Contest In Telangana: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ సమరంలోనూ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కొన్నాళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఈ విన్నపాన్ని చేశారు.
Karnataka KFD Cases: దాదాపు మూడు నుంచి నాలుగేళ్ల పాటు మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచం అల్లకల్లోలమైంది. ఆ మహమ్మారి బెడద ప్రస్తుతం కనుమరుగైనా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉనికి చాటుతోంది. తాజాగా కొత్త కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. భారతదేశంలో తాజాగా మరో వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా కర్ణాటకను భయపెట్టిస్తోంది.
Thalapathy Vijay Party Name: దళపతి విజయ్ కొత్త ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ స్థాపించిన విజయ్.. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. అయితే గతంలో మారిన సినీ సెలబ్రిటీలు స్థాపించిన పార్టీల మాదిరే మారిపోతాడా..? బలమైన రాజకీయ శక్తిగా మారుతుందా..? అనేది చూడాలి.
Farmers Group Called Protest: రెండేళ్ల కిందట నల్ల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసిన రైతు సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో మరోసారి ఉద్యమ బాట పడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.