Paytm IPO news: పేటీఎం ఐపీఓ ప్లాన్స్.. భారీ మొత్తంలో నిధుల సమీకరణకు స్కెచ్

న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద డిజిటల్ పేమెంట్స్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా పేరున్న పేటీఎం తన వ్యాపారాన్ని మరింత భారీ స్థాయిలో విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (Paytm to go for IPO) తెరతీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.21,800 కోట్లు నిధులు సమకూర్చుకోవాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2021, 04:14 PM IST
Paytm IPO news: పేటీఎం ఐపీఓ ప్లాన్స్.. భారీ మొత్తంలో నిధుల సమీకరణకు స్కెచ్

న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద డిజిటల్ పేమెంట్స్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా పేరున్న పేటీఎం తన వ్యాపారాన్ని మరింత భారీ స్థాయిలో విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (Paytm to go for IPO) తెరతీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.21,800 కోట్లు నిధులు సమకూర్చుకోవాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. దాదాపు 3 బిలియన్ల డాలర్లు అన్నమాట. దేశంలో ఒక కంపెనీ మొట్టమొదటిసారే ఇంత భారీ ఎత్తున ఐపీఓకి వెళ్లడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

2010లో కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ రూ.15,000 కోట్లకుపైగా మొత్తాన్ని ఐపీఓ ద్వారా సమకూర్చుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఒక కంపెనీ ఐపీఓకి వెళ్లడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థికంగా బర్క్‌షైర్ ఇన్‌కార్పొరేషన్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్, యాంట్ గ్రూప్ కార్ప్ వంటి కార్పొరేట్ దిగ్గజాల సపోర్ట్ ఉన్న పేటీఎం ఐపీఓ ప్లాన్స్ విషయంలో ప్రస్తుతానికి గోప్యతను పాటిస్తోంది. సంస్థాగతంగా రహస్యంగా ఉన్న పేటీఎం ఐపీఓ మ్యాటర్స్‌ని ఈ డీల్ గురించి తెలిసిన సన్నిహిత వ్యక్తులు మీడియాకు వెల్లడించడంతో అసలు విషయం బయటకు పొక్కినట్టు మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

Also read : LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ

వన్97 కమ్యునికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిస్టర్ అయిన పేటీఎం ఈ ఐపీఓ గురించి చర్చించడానికే రేపటి శుక్రవారం ఓ బోర్డ్ మీటింగ్ నిర్వహించుకోనున్నట్టు సమాచారం. ఐపీఓ విషయమై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. పేటీఎం ప్రతినిధులు మీడియాకు ఆ వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. 

పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ (Paytm CEO Vijay Shekhar Sharma) తన పేటీఎం వ్యాపారాన్ని విస్తరించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. పేటీఎం సేవలను డబ్బుగా మల్చుకునేందుకు ప్లాన్ చేస్తోన్న విజయ్ శేఖర్ శర్మ ఇప్పుడిలా ముందుగా ఐపీఓ (paytm IPO) ద్వారా భారీ మొత్తంలో ఫండ్స్, సమీకరించాలని భావిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News