100 Rupees coin: గ్వాలియర్ రాజమాత బొమ్మతో కొత్త నాణెం విడుదల

ఇండియన్ కరెన్సీలో మరో వంద రూపాయల నాణెం వచ్చిం చేరింది. గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా గౌరవార్దం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు.

Last Updated : Oct 12, 2020, 07:19 PM IST
100 Rupees coin: గ్వాలియర్ రాజమాత బొమ్మతో కొత్త నాణెం విడుదల

ఇండియన్ కరెన్సీ ( Indian Currency ) లో మరో వంద రూపాయల నాణెం ( New Hundred Rupees coin ) వచ్చిం చేరింది. గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా ( Gwalior Rajmata Vijayaraje Scindia ) గౌరవార్దం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు. 

దేశ చరిత్రలో గ్వాలియర్ రాజవంశానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రాజవంశపు రాజమాత విజయరాజే సింధియా అంటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( Pm Narendra modi ) కు ఎనలేని గౌరవం. అందుకే గ్వాలియర్ రాజమాత జన్మశతాబ్ది ఉత్సవాల సందర్బంగా..ఆమె గౌరవార్ధం కొత్త వంద రూపాయల నాణేన్ని ప్రధాని మోదీ వర్చ్యువల్ కార్కక్రమంలో విడుదల చేశారు.  

కేంద్ర ఆర్ధిక శాఖ ఈ కొత్త వంద రూపాయల నాణేన్ని రూపొందించింది. నాణేనికి ఓ వైపు రాజమాత విజయరాజె సింధియా బొమ్మ ఉంటుంది. మరోవైపు అశోకుడి స్థూపం ఉంటుంది. విజయరాజె సింధియా బొమ్మ ఉన్న వైపు..సింధియా వందవ జయంతి అని హిందీ, ఆంగ్లభాషల్లో రాసి ఉంటుంది. స్వయంగా ఆర్ధిక శాఖనే ఈ కాయిన్ డిజైన్ చేసింది. 

తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసిన గ్వాలియర్ రాజమాత విజయరాజె సింధియా..స్వాతంత్ర్యోద్యమం నుంచి రాజకీయాల వరకూ పయనించి కీలకపాత్ర పోషించారని ప్రదాని మోదీ తెలిపారు. అంతేకాకుండా ఏక్తాయాత్ర ( Ektha yatra ) సమయంలో నాడు విజయరాజె సింధియానే తనను గుజరాత్ ( Gujarat ) యువ నాయకుడిగా పరిచయం చేశారంటూ గుర్తు చేసుకున్నారు. Also read: Sri Krishna janmabhoomi Dispute: మధుర కోర్టులో సాగిన విచారణ, అక్టోబర్ 16కు వాయిదా

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x