Sri Krishna janmabhoomi Dispute: మధుర కోర్టులో సాగిన విచారణ, అక్టోబర్ 16కు వాయిదా

రామజన్మభూమి వివాదం పరిష్కారమైంది. ఇప్పుడిక మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదం తెరపైకి వస్తోంది.  మధుర జిల్లా కోర్టులో దాఖలైన పిటీషన్ పై దాదాపు రెండు గంటల సేపు విచారణ సాగింది. అనంతరం అక్టోబర్ 16కు వాయిదా పడింది.

Last Updated : Oct 12, 2020, 06:51 PM IST
  • మధురలోని శ్రీ కృష్ణజన్మభూమి-షాహీ ఈద్గాహ్ మసీదు వివాదంపై కోర్టులో వాదనలు
  • అక్టోబర్ 16కు తీర్పు వాయిదా
  • షాహీ ఈద్గాహ్ మసీదు స్థానంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడి మందిరంతో పాటు కంసుడి కారాగారం ఉండేదనేది ఓ వర్గం వాదన
Sri Krishna janmabhoomi Dispute: మధుర కోర్టులో సాగిన విచారణ, అక్టోబర్ 16కు వాయిదా

రామజన్మభూమి వివాదం ( Rama janmabhoomi Dispute ) పరిష్కారమైంది. ఇప్పుడిక మధుర ( Madhura ) లోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదం ( Sri krishna janmabhoomi Dispute ) తెరపైకి వస్తోంది.  మధుర జిల్లా కోర్టులో దాఖలైన పిటీషన్ పై దాదాపు రెండు గంటల సేపు విచారణ సాగింది. అనంతరం అక్టోబర్ 16కు వాయిదా పడింది. 

అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదానికి సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తెరపడింది. బాబ్రీ విధ్వంసం ( Babri Demolition case ) కేసును కూడా కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు ( Supreme court ) తీర్పు నేపధ్యంలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ కూడా పూర్తయింది. ఇక ఇప్పుడు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదం తెరపైకి వచ్చింది. మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గాహ్ మస్జిద్ ( Shahi Eidgah Masjid ) వివాదంపై ఇవాళ మధ్యాహ్నం జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పై దాదాపు 2 గంటల సేపు వాదనలు కొనసాగాయి. అనంతరం తీర్పును అక్టోబర్ 16కు వాయిదా వేసింది మధుర జిల్లా కోర్టు ( Madhura District Court ). గతంలో ఓసారి సివిల్ కోర్టులో భగవంతుడి తరపున దాఖలైన  ఓ న్యాయవాది పిటీషన్ ను అనుమతించలేదు.  

శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి షాహీ ఈద్గాహ్ మసీదు ఆక్రమణను తొలగించి..దానికి సంబంధించిన 13.37 ఎకరాల భూమిని తిరిగి అప్పగించాల్సిందిగా హిందూపక్షం వాదిస్తోంది. ఒకప్పుడు ఇక్కడే శ్రీకృష్ణుడి భవ్యమందిరంతో పాటు, కంసుడి జైలు ఉండేదని హిందూపక్షం వాదన. అయితే మొఘల్స్ సమయంలో దీన్ని పగలగొట్టి ఆ స్థానంలో షాహీ ఈద్గాహ్ మసీదు నిర్మించారంటోంది హిందూపక్షం.  

హిందూవర్గాలు ఈ అంశంపై మధురలోని సివిల్ జడ్జి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కానీ కేవలం భక్తుడైనంత మాత్రాన భగవంతుడి తరపున కోర్టులో కేసు వేయడానికి అధికారం లేదని చెబుతూ పిటీషన్ ను తిరస్కరించింది. ఆ తరువాత సివిల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ జిల్లా కోర్టులో హిందూపక్షం పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం విచారణ సాగింది. తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది కోర్టు. Also read: Kushboo Joins BJP: భాజపా తీర్థం పుచ్చుకున్న కుష్బూ

Trending News