నిత్యం రాజ్యాంగం పరిరక్షణ, దేశాభివృద్ధితో తలమునకలు అయ్యుండే రాష్ట్రపతి క్రికెట్ ఆడితే ఎలా వుంటుందో చూడాలని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ ట్విటర్‌లో షేర్ చేసుకున్న ఈ ఇమేజ్ చూడాల్సిందే. ఇటీవల జరిగిన ఓ ఎలక్ట్రానిక్ గేమింగ్ బ్రాండ్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. 'వర్చువల్ రియాలిటీ' (వీఆర్) పరిజ్ఞానంతో రూపొందిన క్రికెట్ గేమింగ్‌ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్..కళ్లకు వీఆర్ అద్దాలు ధరించి, చేతిలోకి బ్యాట్ తీసుకుని కొన్ని షాట్స్ ఆడారు.
Waah ji, kya baat hai, maananiya @rashtrapatibhvn ji, aap bhi opening pe!
Har koi banega Sehwag, @iB_Cricket ke saath!
Ab aayega asli Mazaa... 👌#PresidentPlaysCricket #NewFormatOfCricket pic.twitter.com/MZM15vsVeh— Virender Sehwag (@virendersehwag) February 23, 2018
వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్‌లో షేర్ చేసుకున్న ఈ ఫోటోలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బ్యాటింగ్ చేయడాన్ని గమనించొచ్చు. రాష్ట్రపతి కోవింద్ బ్యాటింగ్ చేస్తుండగా ఆ పక్కనే ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్న తీరును ఈ ఫోటోలో చూడవచ్చు. ఇదే విషయాన్ని సేహ్వాగ్ ప్రస్తావిస్తూ.. " రాష్ట్రపతి గారు కూడా ఓపెనర్‌గా బ్యాటింగ్‌కి దిగారు " అని తనదైన స్టైల్లో ట్వీట్ చేసిన సేహ్వాగ్.. ఐబీ క్రికెట్‌తో ఇక ఎవరైనా క్రికెట్‌లోని అసలు మజాను ఆస్వాదించవచ్చని పేర్కొన్నాడు.