రాధే మా కు వీఐపి ట్రీట్మెంట్

Last Updated : Oct 5, 2017, 05:19 PM IST
రాధే మా కు వీఐపి ట్రీట్మెంట్

వివాదాస్పద సాధ్వి రాధే మా మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా దిల్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి, పోలీస్ అధికారి కుర్చీలో కూర్చోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే.. గతవారం రాధే మా దిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి .. ఏకంగా పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి సీటులో కూర్చున్నారు. ఆ అధికారి పక్కన నిల్చొని చేతులు కట్టుకొని నిల్చున్నాడు. భుజంపై ఎర్ర చున్నీ ధరించాడు. ఈ ఫోటో బయటికి రావడంతో రాధే మాను పోలీసులు వీవీఐపిలా గౌరవించారంటూ వార్తలు వచ్చాయి. 

ఈ విషయమై సదరు పోలీస్ అధికారిని ప్రశ్నించగా.. రాధే మా పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు అంగీకరించాడు. నేను ఆవిడ ముందు చేతులు జోడించి నిలబడలేదని, వెళ్లిపోవాల్సిందిగా కోరానని చెప్పారు. రాధే మా గతనెల 28 వ తేదీన తన అనుచరులతో కలిసి మా స్టేషన్ ముందు నుంచి రాంలీలా వెళ్లారు. ఆ సమయంలో ఆమె అనుచరులు కొంతమంది వచ్చి రాధేమా బాత్రూంకు వెళ్లాలని చెప్పాగా, నేను అంగీకరించాను. రాధేమా బాత్రూం ఉపయోగించుకొని నేరుగా నా గదిలో ఉన్న కుర్చీలో అనుమతిలేకుండా కూర్చున్నారు. నేను మహిళల మీద ఉన్న గౌరవంతో, వెళ్లిపోవాలని చేతులు జోడించి విన్నవించాను. ఇదంతా నిమిషాల్లోనే జరిగిపోయింది." అని చెప్పారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులను అడగగా విచారణ చేపడతామని చెప్పారు. 

&

;

Trending News