Bank Holidays: డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవు, ఎప్పుడెప్పుడంటే

Bank Holidays: బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకు కస్టమర్లకు కీలక గమనిక. ఈ నెలలో బ్యాంకులు ఏకంగా 17 రోజులు మూతపడనున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఈ సెలవులు మారినా ఆన్‌లైన్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 2, 2024, 03:53 PM IST
Bank Holidays: డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవు, ఎప్పుడెప్పుడంటే

Bank Holidays: ప్రస్తుతం బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్ విధానంలోనే కొనసాగుతున్నా కొన్ని ప్రత్యేకమైన పనులకు మాత్రం విధిగా బ్యాంకులకు వెళ్లాల్సిందే. అందుకే బ్యాంకు పనులుండేవాళ్లు ఏ రోజు ఎక్కడ బ్యాంకులకు సెలవుందో తెలుసుకోవడం మంచిది. అటు ఆర్బీఐ కూడా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. డిసెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 17 రోజులు సెలవులున్నాయి. 

బ్యాంకులకు దేశవ్యాప్తంగా ప్రతి నెలా 2వ, 4వ శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలు సెలవులుంటాయి. ఇవి కాకుండా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. ఇందులో కొన్ని జాతీయ స్థాయిలో ఉంటే కొన్ని ప్రాంతీయంగా ఉంటాయి. నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు తక్కువే. కానీ డిసెంబర్ నెలలో 17 రోజులు సెలవులున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన బ్యాంకు సెలవుల జాబితాను ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx. ద్వారా చెక్ చేసుకోవచ్చు. 

డిసెంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా

డిసెంబర్ 3 గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సెలవు
డిసెంబర్ 8 ఆదివారం సెలవు
డిసెంబర్ 12 మేఘాలయలో సెలవు
డిసెంబర్ 14 రెండవ శనివారం సెలవు
డిసెంబర్ 15 ఆదివారం సెలవు
డిసెంబర్ 18 మేఘాలయలో సెలవు
డిసెంబర్ 19 గోవాలో గోవా లిబరేషన్ డే సెలవు
డిసెంబర్ 22 ఆదివారం సెలవు
డిసెంబర్ 24 మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో సెలవు
డిసెంబర్ 25 క్రిస్మస్ దేశమంతటా సెలవు
డిసెంబర్ 26 మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌లో సెలవు
డిసెంబర్ 27 నాగాలాండ్‌లో క్రిస్మస్ వేడుకల సెలవు
డిసెంబర్ 28 రెండవ శనివారం సెలవు
డిసెంబర్ 29 ఆదివారం సెలవు
డిసెంబర్ 30 మేఘాలయలో సెలవు
డిసెంబర్ 31 మిజోరాం, సిక్కింలో సెలవు

Also read: Seize the Ship: సీజ్ ది షిప్..ఆ అధికారం నీకెక్కడిది పవన్ అంటూ ట్రోలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News