పాతికేళ్ల గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల కల నెలవేరింది

సుప్రీం తీర్పుతో 1993 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు జాతీయ బ్యాంకులతో సమానంగా పింఛను వస్తుందని చెప్పారు.

Last Updated : Apr 29, 2018, 09:33 AM IST
పాతికేళ్ల గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల కల నెలవేరింది

గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. జాతీయ, వాణిజ్య బ్యాంకుల ఉద్యోగులతో సమానంగా గ్రామీణ (రీజనల్ రూరల్ బ్యాంక్) బ్యాంకు ఉద్యోగులకు పింఛను ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు 25 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈమేరకు తీర్పునిచ్చిందని ఆల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఆర్‌ఆర్‌బీఈఏ) ఉపాధ్యక్షుడు కే. భిక్షమయ్య తెలిపారు.

సుప్రీం తీర్పుతో 1993 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు జాతీయ బ్యాంకులతో సమానంగా పింఛను వస్తుందని చెప్పారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులను ఈపీఎఫ్ కోటాలో చేర్చిన భారత ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు రూ.2,500 పింఛను ఇస్తున్నదని అన్నారు. 2011లో కర్ణాటక కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. కేంద్రం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందన్నారు.  ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం దీనిని పరిశీలించి తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు.

Trending News