సచిన్ వీరాభిమానిపై దాడి.. బూతులు తిడుతూ బూటు కాలితో తన్నిన పోలీస్...

Sachin fan assaulted by Police: ఒకప్పుడు అదే ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సెలబ్రిటీ హోదాలో తానే ప్రారంభించానని సుధీర్ కుమార్ పేర్కొన్నాడు. ఇప్పుడదే పోలీస్ స్టేషన్‌లో తనకు అవమానం జరగడం బాధగా ఉందన్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 12:11 PM IST
  • సచిన్ వీరాభిమాని సుధీర్ చౌదరిపై దాడి
  • సుధీర్ చౌదరిని బూటు కాలితో తన్నిన పోలీస్
  • సోదరుడి కోసం పోలీస్ స్టేషన్ వెళ్లిన సుధీర్
సచిన్ వీరాభిమానిపై దాడి.. బూతులు తిడుతూ బూటు కాలితో తన్నిన పోలీస్...

Sachin fan assaulted by Police: ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరికి ఊహించని పరిస్థితి ఎదురైంది. సోదరుడి కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సుధీర్‌పై ఓ పోలీస్ దాడికి పాల్పడ్డాడు. ఒకప్పుడు సెలబ్రిటీ హోదాలో తాను ప్రారంభించిన పోలీస్ స్టేషన్‌లోనే ఇప్పుడు తనపై దాడి జరిగిందని సుధీర్ కుమార్ వాపోయాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలిపాడు.

'నా సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసి.. విషయమేంటో కనుక్కుందామని నేను ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. లాకప్‌లో ఉన్న సోదరుడితో మాట్లాడుతున్న సమయంలో డ్యూటీ ఆఫీసర్ నా వద్దకు వచ్చి నన్ను దూషించాడు. ఆపై రెండుసార్లు బూటు కాలుతో నా కాలిపై తన్నాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరించాడు. నన్ను, నా సోదరుడిని బూతులు తిట్టాడు.' అని సుధీర్ కుమార్ వాపోయాడు.

ఒకప్పుడు అదే ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సెలబ్రిటీ హోదాలో తానే ప్రారంభించానని సుధీర్ కుమార్ పేర్కొన్నాడు. ఇప్పుడదే పోలీస్ స్టేషన్‌లో తనకు అవమానం జరగడం బాధగా ఉందన్నాడు. సామాన్యుల పట్ల పోలీసుల జులుంకు ఈ ఘటన నిదర్శనమన్నాడు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని.. దీనిపై విచారణ జరిపిస్తామని వారు హామీ ఇచ్చారని సుధీర్ కుమార్ తెలిపాడు.

కాగా, సుధీర్ కుమార్ సోదరుడిని ఓ భూ వివాదం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదానికి అతను సాక్ష్యంగా ఉన్నట్లు చెబుతున్నారు. సుధీర్ కుమార్ చౌదరిపై దాడి ఘటన తమ దృష్టికి రాలేదని ముజఫర్‌పూర్ (Bihar Latest) ఐజీపీ పేర్కొనడం గమనార్హం. 

Also Read: మినిస్టర్ సార్.. నా ఆత్మహత్యకు అనుమతినివ్వండి.. కేటీఆర్‌కు యువ రైతు లేఖ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News