12వ తేదీన ఇషా అంబాని పెళ్లి.. అప్పుడే ఉదయ్‌పూర్‌కు క్యూ కట్టిన ప్రముఖులు, తారలు

ఉదయ్‌పూర్‌లో ప్రముఖుల సందడి  

Updated: Dec 8, 2018, 05:58 PM IST
12వ తేదీన ఇషా అంబాని పెళ్లి.. అప్పుడే ఉదయ్‌పూర్‌కు క్యూ కట్టిన ప్రముఖులు, తారలు
SOURCE : ANI

ఉదయ్‌పూర్‌: డిసెంబర్ 12న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరగనున్న ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని-ఆనంద్ పిరమల్‌ పెళ్లి వేడుకకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పెళ్లికన్నా ముందుగా జరగనున్న ప్రీ వెడ్డింగ్ సెరెమనీలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాల ప్రముఖులు  ఉదయ్‌పూర్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలోనే అంబాని ఆహ్వానం మేరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, ఆయన సతీమణి అంజలి టెండుల్కర్, ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్లయిన ప్రియాంకా చోప్రా-నిక్ జోనస్, టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి ధోని, వారి గారాలపట్టి జివా ధోని తాజాగా ఉదయ్‌పూర్ చేరుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్, ఆమె భర్త, ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, జాన్ అబ్రహం-ప్రియ రుంచాల్, జావేద్ జాఫ్రి సైతం ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఉదయ్‌పూర్ చేరుకున్నట్టు ఏఎన్ఐ వెల్లడించింది. ప్రముఖుల రాకతో ఉదయ్‌పూర్ పరిసరాలు తారాతీరాన్ని తలపిస్తున్నాయి.