Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎంకే స్టాలిన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం అన్నాడీఎంకే కూడా స్వాగతించడం విశేషం.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Mk Stalin) పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపర్చడమే కాకుండా ఆమోదయోగ్యంగా ఉంటున్నాయి. కొత్తగా రిజర్వేషన్లకు సంబంధించి తీసుకున్న మరో నిర్ణయం అందరి ఆమోదం పొందుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధినీ విద్యార్ధులకు రిజర్వేషన్ కోటా కల్పిస్తూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది.ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే(AIADMK) సైతం ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు ప్రకారం..యూనివర్సిటీల్లోని వెటర్నరీ సైన్సెస్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ వంటి వృత్తిపరమైన కోర్సుల్లో అన్ని కేటగరీల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది.చాలా ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు..ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులతో పోటీ పడుతూ సామాజిక-ఆర్ధిక అసమానతల కారణంగా కావల్సిన కోర్సుల్లో ప్రవేశం పొందలేకపోయారని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామాల్నించి వచ్చే విద్యార్ధులు, డబ్బులేని విద్యార్ధులకు మంచి అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జస్టిస్ మురుగేశన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ బిల్లును ప్రవేశపెట్టాని గతంలోనే మంత్రివర్గం(Cabinet)నిర్ణయించింది.
Also read: e Shram Portal: దేశ చరిత్రలోనే తొలిసారి, అసంఘటిత కార్మికుల కోసం ఓ వ్యవస్థ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook