మహిళ గొంతు కోసి పరారైన ఉగ్రవాదులు

జమ్ము కాశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో ఉగ్రవాదులు ఒక మహిళను గొంతు కోశారు.

Updated: Jul 9, 2018, 12:19 PM IST
మహిళ గొంతు కోసి పరారైన ఉగ్రవాదులు

జమ్ము కాశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో ఉగ్రవాదులు ఒక మహిళను గొంతు కోసి చంపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. హజీన్‌ ప్రాంతంలోని షాగంద్‌ గ్రామంలో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి)కి చెందిన అబ్దుల్‌ మాజిద్‌ దార్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ఉగ్రవాదులు చొచ్చుకుని వెళ్లి దార్‌ భార్య షకీలా బేగం గొంతు కోసి పారిపోయారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆమెను తక్షణమే శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కుప్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రత బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌లో సీఆర్పీఎఫ్ ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేసి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.