త్రిపుర కొత్త సీఎం రేసులో ఓ జిమ్ ఇన్‌స్ట్రక్టర్ ?

ఇప్పటివరకు కమ్యూనిస్ట్ యోధుడు మానిక్ సర్కార్ కూర్చున్న సీటులో ఇప్పుడు బీజేపీ ఎవరిని కూర్చోబెడుతోందనే అంశంపై లేటెస్ట్ అప్‌డేట్స్ 

Last Updated : Mar 3, 2018, 08:01 PM IST
త్రిపుర కొత్త సీఎం రేసులో ఓ జిమ్ ఇన్‌స్ట్రక్టర్ ?

త్రిపురలో 25 ఏళ్లుగా తిరుగులేని విధంగా రాజ్యాధికారాన్ని చేపడుతూ వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీని భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి గద్దె దించిన సంగతి తెలిసిందే. త్రిపురలో చరిత్రాత్మక విజయం సాధించి, చరిత్ర సృష్టించిన బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఎవ్వరిని సీఎంగా కూర్చోబెట్టనుంది అనేదానిపైనే ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం త్రిపుర రాజధాని అగర్తలలో మీడియాతో మాట్లాడిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిప్లబ్ దేవ్.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాడానికి తాను సిద్ధంగా వున్నాను అని స్పష్టంచేశారు. అయితే, ఆ స్థానంలో ఎవరు కూర్చోవాలి అనేది మాత్రం పార్టీ హై కమాండ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డుదే అంతిమ నిర్ణయం అని అన్నారు బిప్లబ్ దేవ్. బీజేపీ ఎటువంటి బాధ్యతలు అప్పగించినా అవి చేపట్టడానికి తాను వెనుకడుగు వేయబోనని చెప్పే సందర్భంలో బిప్లబ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లోకి రాకముందు జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన బిప్లబ్ దేవ్ రాజకీయాల్లోకి వచ్చాకా బీజేపీలో చురుకైన నేతగా ఎదిగారు. సీపీఎం పార్టీకి కంచుకోటగా వున్న త్రిపురలో బీజేపీ తరపున ఆ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసి అంతిమంగా విజయం సాధించారు.

Trending News