Train Collision Video: ఒడిశా ఘోర రైలు విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం.. ఎక్కడో తెలుసా..?

Punjab train collision: పంజాబ్ గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ ట్రైన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరు లోకోపైలేట్లు తీవ్రంగా గాయపడ్డారు. ట్రైన్ పూర్తిగా మరో పట్టాల మీదకు పల్టీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 2, 2024, 02:11 PM IST
  • పంజాబ్ లో మరో రైలు ప్రమాదం..
  • అప్రమత్తమైన ఇండియన్ రైల్వేస్..
Train Collision Video: ఒడిశా ఘోర రైలు విషాదానికి ఏడాది.. ఇవాళ  మరో రైలు ప్రమాదం.. ఎక్కడో తెలుసా..?

Punjab train collission video viral: కొన్నిరోజులుగా రైల్వే ప్రమాదాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. సిగ్నల్ లలో లోపం, రైళ్లలో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఇండియాన్ రైల్వేస్ అనేక దిద్దుబాటు చర్యలను చేపట్టింది.  సిగ్నలింగ్ వ్యవస్థలలో అనేక టెక్నికల్ మార్పలు దిశగా చర్యలు చేపట్టింది. అయిన కూడా రైలు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. గతేడాది  ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశంలో తీవ్ర కలకంగా మారిన విషయం తెలిసిందే. రైల్వేచరిత్రలోనే ఇది అత్యంత భయానక ఘటనగా రైల్వే వర్గాలు వెల్లడించాయి.  కోరమాండల్ ట్రైన్ ఆగిఉన్న , గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టి పట్టాలు తప్పింది.

 

అంతేకాకుండా..మరో ట్రాక్ మీద యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ ను బలంగా ఢీకొట్టింది. అప్పుడు జరిగిన ఘటనలో దాదాపు.. 275 మంది రైలు ప్రయాణికులు మరణించగా, మరో వెయ్యి మంది వరకు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గతేడాది 2023 జూన్ 2 సంభవించింది. అయితే.. అచ్చం ఏడాది తర్వాత జూన్ 2 , 2024 రోజు మరో రైలు ప్రమాదం చోటుచేసుకొవడం చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాలు...

ఆదివారం తెల్లవారుజామున అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే లైన్‌లోని ఫతేఘర్ సాహెబ్‌ వద్ద రెండు రైళ్లు ఢీ బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో  ఇద్దరు లోకోపైలేట్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పి,  ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని నివేదికలు తెలిపాయి. రైల్వే పోలీసుల ప్రకారం..  సిర్హింద్ రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్యాసింజర్ రైలును,  గూడ్స్  రవాణా రైలును వెనుక నుండి మరొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పేర్కొంది.

 ట్రైన్ లు బలంగా.. ఢీకొనడం వల్ల ఒక ఇంజన్ మరో ట్రాక్‌పైకి పల్టీలు కొట్టి ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని నివేదికలు పేర్కొన్నాయి.ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.  కానీ లోకో పైలట్లు వికాస్ కుమార్, హిమాన్షు కుమార్‌లు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. లోకోపైలేట్ లు ఇద్దరిని ఫతేఘర్ సాహిబ్ సివిల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  వికాస్ కుమార్ తలపై  హిమాన్షు కుమార్ నడుము వెనుక భాగంలో గాయాలయినట్లు వైద్యులు వెల్లడించారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News