Lucknow: ప్రిన్సిపాల్ మందలించాడని తుపాకీతో కాల్చిన విద్యార్థి, వీడియో వైరల్

Lucknow: ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి అతడిపై కాల్పులకు పాల్పడిన ఘటన యూపీలోని సీతాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2022, 08:29 AM IST
  • యూపీలో దారుణం
  • మందలించాడని ప్రిన్సిపాల్ పై స్డూడెంట్ కాల్పులు
  • విద్యార్థి కోసం గాలిస్తున్న పోలీసులు
Lucknow: ప్రిన్సిపాల్ మందలించాడని తుపాకీతో కాల్చిన విద్యార్థి, వీడియో వైరల్

Lucknow: విద్యార్థులు తప్పు చేస్తే టీచర్స్ మందలించడం కామన్. కానీ ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ మందలించాడని అతనిపై కోపం పెంచుకుని తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో శనివారం జరిగింది. బిస్వాన్ తహసీల్‌లోని సదర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ రామ్‌స్వరూప్ ఇంటర్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. 

అసలేం జరిగిందంటే...
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఆదర్శ్ ఇంటర్ కాలేజీలో 12వ తరగతి (Class 12 Student) చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య శుక్రవారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి మరో విద్యార్థిని కొట్టాడు. ఈ విషయం కళాశాల ప్రిన్సిపాల్ రామ్​ సింగ్ వర్మకు తెలిసి దాడి చేసిన విద్యార్థిని తిట్టాడు. దీంతో ప్రిన్సిపల్ పై కక్ష పెంచుకున్నాడు ఆ స్టూడెంట్. తర్వాత రోజు కాలేజీకి తన వెంట తుపాకీ తెచ్చుకున్న ఆ విద్యార్థి ప్రిన్సిపల్ పై కాల్పులు జరిపి పారిపోయాడు. అనంతరం ప్రిన్సిపల్ ను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. 

విద్యార్థి తుపాకీ పట్టుకుని ప్రిన్సిపాల్‌ని వెంబడిస్తున్న దృశ్యాలు మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రిన్సిపాల్ రామ్ సింగ్ వర్మపై రెండుసార్లు కాల్పులు జరిపారని, అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రిన్సిపాల్‌ను చికిత్స నిమిత్తం లక్నోకు తరలించారు. పరారైన విద్యార్థి కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు. 

Also Read; MLAS IN ASSEMBLY: తంబాక్ తింటూ ఒకరు.. కార్డ్స్‌ గేమ్ లో మరొకరు! అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల బాగోతం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.         

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News