Xiaomi sells over 1 million devices in 1 day : ఒక్కరోజులోనే 10 లక్షల ఉత్పత్తులు విక్రయించిన షామీ

షామీ... స్మార్ట్ ఫోన్స్ వ్యాపారంలో ఓ విప్లవం సృష్టించి ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు గట్టిపోటినిచ్చిన ఈ చైనీస్ కంపెనీ మూడేళ్ల క్రితం వరకు ఆఫ్‌లైన్ సేల్స్ జరిపేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. 2017 కంటే ముందుగా కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయాలు సాగించిన షామీ ఆ తర్వాతే డీలర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆఫ్‌లైన్‌లోనూ సేల్స్ ప్రారంభించింది.

Last Updated : Jan 15, 2020, 03:09 PM IST
Xiaomi sells over 1 million devices in 1 day : ఒక్కరోజులోనే 10 లక్షల ఉత్పత్తులు విక్రయించిన షామీ

న్యూఢిల్లీ: షామీ... స్మార్ట్ ఫోన్స్ వ్యాపారంలో ఓ విప్లవం సృష్టించి ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు గట్టిపోటినిచ్చిన ఈ చైనీస్ కంపెనీ మూడేళ్ల క్రితం వరకు ఆఫ్‌లైన్ సేల్స్ జరిపేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. 2017 కంటే ముందుగా కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయాలు సాగించిన షామీ ఆ తర్వాతే డీలర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆఫ్‌లైన్‌లోనూ సేల్స్ ప్రారంభించింది. అయితే, ఆఫ్‌లైన్ సేల్స్‌లో  అతి కొద్ది కాలంలోనే అద్భుతమైన విజయాలు సాధించామని చెప్పుకుంటున్న షియోమి తాజాగా జనవరి 10, శుక్రవారం నాడు మరో మైలు రాయిని అధిగమించింది. షామీ ట్విటర్ ద్వారా చేసిన ఓ ప్రకటన ప్రకారం జనవరి 10న షియోమి సంస్థ ఆఫ్‌లైన్ ద్వారా 10 లక్షలకు ఉత్పత్తులపైగానే విక్రయాలు జరిపింది. స్మార్ట్ ఫోన్స్, ఎంఐ టీవీలు, ఎంఐ ఈకోసిస్టం, ఇతర యాసెసరీ ఉత్పత్తులు అన్నీ కలుపుకుని దాదాపు 10 లక్షలకుపైగా ఉత్పత్తులు విక్రయించినట్టు షామీ మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. అమ్ముడైన ఉత్పత్తుల్లో స్మార్ట్ ఫోన్స్ అధిక సంఖ్యలో ఉన్నాయి. ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియో, ఎంఐ స్టోర్స్, ప్రిఫర్డ్ పార్టనర్స్‌తో పాటు ఇతర రీటెయిల్ దుకాణాల్లో ఈ ఉత్పత్తుల విక్రయాలు జరిగినట్టు షామీ స్పష్టంచేసింది.

2020 ఏడాదిలో ఆఫ్‌లైన్ సేల్స్‌లో మరింత వృద్ధి సాధించగలమనే నమ్మకం ఉందని.. ఈ ఏడాదిలో ఎంఐ అభిమానులకు మరింత చేరువవుతామని షామీ ఇండియా ఆఫ్‌లైన్ ఆపరేషన్స్ అధినేత సునీల్ ధీమా వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంఐ స్టోర్లను మరింత విస్తరిస్తున్నామని.. 2018 అక్టోబర్ 29న ఒకేసారి 519 ఎంఐ స్టోర్లను ప్రారంభించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించామని షియోమి తెలిపింది. 2017లో మే 20న తొలిసారిగా ఎంఐ హోమ్ స్టోర్ ప్రారంభించినప్పుడు కేవలం 12 గంటల వ్యవధిలోనే రూ.5 కోట్ల ఆదాయం ఆర్జించడం ఎంఐ ఉత్పత్తులకు ఉన్న క్రేజీకి సంకేతం అని షామి అభిప్రాయపడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x