Anti Hair Fall Oil: హెయిర్ ఫాల్ సమస్య అనేది అందరిలోనూ ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా, తేమ కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. జుట్టు మూలల్లో ఉండే ఫైబర్ మురికి లాగా మారి.. కొత్త జుట్టు ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేస్తుంది. దీని కారణంగా తీవ్ర జుట్టు సమస్యలతో పాటు జుట్టు రాలడం తీవ్ర తరమవుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మందిలో ఒత్తిడి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు రాలడమేకాకుండా అలెర్జీలు ఇతర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ జుట్టు రాలడం సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
వేపలో జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి వేపను జుట్టుకు సమస్యలతో బాధపడుతున్నవారు వినియోగించడం వల్ల జుట్టు రాలడం నుంచి ఉపశమనం లభిస్తుంది. వేపలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ గుణాలు జుట్టు రాలడం, జుట్టులో చుండ్రును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వేపనూనెను తప్పకుండా జుట్టుకు వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎతో పాటు చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి జుట్టును మృదువుగా ఉంచేందుకు సహాయపడుతుంది.
జుట్టు సమస్యలను ఇలా తగ్గించుకోండి:
వేపనూనె:
మార్కెట్‌లో లభించే వేప నూనెను తీసుకుని జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల తలకు తేమ అందుతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది.
వేప షాంపూ:
వేప షాంపూలో ఉండే గుణాలు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
వేప పేస్ట్ :
వేప పేస్ట్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను దూరం చేసేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది.
వేప ఆకుల నీరు:
వేప ఆకులను నీటిలో బాగా మరిగించి జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌ను కూడా దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వేప బెరడు పొడి:
వేప బెరడు పొడిలో ఉండే ఆయుర్వేద గుణాలు తీవ్ర జుట్టు రాలడాన్ని తగ్గించడమేకాకుండా జుట్టును లోపల నుంచి దృఢంగా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పొడిని వినియోగించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook