Kalonji Oil, Bhringraj Castor Oil for Black Hair in 10 Days: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు, ఆధునిక జీవన శైలిని పాటించడమేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినడమేనని ఆరోగ్య నిపుణులు చెడుతున్నారు. కాబట్టి ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఔషధ గుణాలు కలిగిన నూనెలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని ఆపి పొడవుగా, ఒత్తుగా, దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎలాంటి ఔషధ గుణాలు కలిగిన నూనెలను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హెయిర్ అయిల్స్‌తో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలకు చెక్:
1. బృంగరాజ్ నూనె:
ఆయుర్వేద శాస్త్రంలో బృంగరాజ్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు, చర్మానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. దీనితో తయారు చేసిన నూనెను క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా దృఢంగా, ఒత్తుగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టును నల్లగా చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తరచుగా చుండ్రు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బృంగరాజ్ నూనెను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి మీ తలకు అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడానికి కూడా సహాయపడుతుంది.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
2. కలోంజి నూనె:
కలోంజి సీడ్స్ నుంచి తయారు చేసిన నూనెనే కలోంజి ఆయిల్ అని అంటారు. ఇందులో కూడా చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ ఆయిల్‌ను క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల నల్లగా మారుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది జుట్టు పెరుగుదల కోసం చాలా మంది మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడకుండా ఈ నూనెను వాడడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
3. ఆముదం నూనె:
ప్రస్తుతం చాలా మంది ఆముదం నూనెను వంటకాల్లో వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ఆముదం నూనెను జుట్టుకు వాడడం వల్ల చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. కాబట్టి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook