Homemade Cardamom Face Pack: మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే మసాల దినుసలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా కీలక ప్రాత పోషిస్తాయి. అందులో చిన్నగా మొగ్గల్లాగా ఉండే యాలకులు ఒకటి.
యాలకులను ఎక్కువగా స్వీట్ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి ఎంతో సువాసన కలిగి ఉంటాయి. యాలకుల టీ ని కూడా చాలా మంది తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల చర్మానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అయితే యాలకులతో చర్మానికి కొన్ని ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల సహాజంగా, కాంతివంతమైన చర్మాని పొందవచ్చు.
1. యాలకులతో ఫేస్ స్క్రబ్ (Face Scrub):
చర్మం మృదువుగా ఉండాలంటే యాలకులతో ఫేస్ స్క్రబ్ చేయడం ఎంతో మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఒక స్పూన్ యాలకల పొడి, తేనె ఒక స్పూన్, పంచదార ఒక టీ స్పూన్ తీసుకోవాలి. వీటని ఒక గిన్నెలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాన్‌ను ముఖం, మెడ భాగాల్లో రాసుకొని మర్దనా చేసుకోవాలి. పది నిమిషాలు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
2. యాలకులతో లిప్ స్క్రబ్ ( Lip Scrub):
పెదాలు గులాబీ రేకుల ఉండాలంటే యాలకుల పొడితో ఈ పదార్థాలు కలుపుకొని మర్దన చేయాలి. దీని కోసం యాలకుల పొడి, పంచదార, తేనె కలుపుకొని పెదాలపై రాసుకోవాలి. దీని వల్ల పెదాలపై ఉన్న నల్ల మరకలు సులువుగా తొలిగిపోతాయి. అంతేకాకుండా దీని ప్రతిరోజు లిప్ బామ్‌గా వాడుకోవచ్చు.
౩. యాలకులతో హైడ్రేషన్ మాస్క్( Hydrating mask):
చర్మం తేమగా ఉండటం చాలా అవసరం. చర్మాని తేమగా ఉంచాలంటే ఇది ఫేస్ ప్యాక్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా యాలకుల పొడిని, రెండు చెంచాల తేనె కలుపుకోవాల్సిన ఉంటుంది. ఈ పదార్థాలు పెదాలను మాయిశ్చరైజర్ చేస్తాయి. చలికాలంలో ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల పెదాలు పగలకుండా ఉంటాయి.
4. యాలకులతో ఫేస్ ప్యాక్ (Face Pack):
యాలకుల పొడి, పసుపు, నిమ్మరసం కలుపుకొని ముఖాన్నికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్‌ను పావుగంట పాటు ఉంచడం వల్ల మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి. చర్మంలో మార్పు కనిపిస్తుంది.
గమనిక:
యాలకులతో ఈ ఫేస్ ప్యాక్, ఫేస్ మాస్క్‌లను అప్లై చేసుకొనే ముందు చేతులపై పరీక్షించుకోవాల్సి ఉంటుంది. దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉపయోగించడం మానుకోండి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.